Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
'Tagore' than to be a big hit?

ఈ సంచికలో >> సినిమా >>

ఐష్‌ కోసం అభిషేక్‌ గెస్ట్‌ రోల్‌

Abhishek  guest role for Aishwarya

ఐశ్వర్యారాయ్‌ వెండితెరపై రీ`ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘జజ్‌బా’. సంజయ్‌ గుప్తా రూపొందిస్తున్న ఈ సినిమా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. ముఖ్యమైన ప్రత్యేకత ఆరాధ్యకు జన్మనిచ్చాక ఐశ్వర్యారాయ్‌ నటిస్తున్న తొలి సినిమా ఇదే. కూతురు ఆలనా పాలనా స్వయంగా చూసుకోవడం కోసం సినిమా కెరీర్‌ని త్యాగం చేసింది ఐశ్వర్యారాయ్‌.‘జజ్‌బా’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నా, విరామం దొరికితే కూతురు ఆరాధ్య యోగక్షేమాల్ని ఐశ్వర్యారాయ్‌ పర్యవేక్షించుకుంటూ వచ్చింది. అలా ‘జజ్‌బా’ షూటింగ్‌ ఎంతో సరదాగా, ఎంతో కొత్తగా సాగిందని ఐశ్వర్యారాయ్‌ చెబుతుంది. అభిషేక్‌ కూడా సినిమాలో నటిస్తే బావుంటుందేమోనని దర్శకుడు సంజయ్‌ గుప్తా సూచించడంతో ఐశ్వర్యారాయ్‌ కాదనలేకపోయిందట.భార్య నటించే సినిమాలో తానూ కనిపించడం గర్వంగా ఫీలవుతున్నానంటాడు అభిషేక్‌ బచ్చన్‌. ‘రావణ్‌’, ‘గురు’ చిత్రాల్లో అభిషేక్‌, ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించాడు. ‘జజ్‌బా’లో అభిషేక్‌ గెస్ట్‌ రోల్‌లోనే కనిపించనున్నప్పటికీ, సినిమాలో ముఖ్యమైన సన్నివేశం అభిషేక్‌ మీద చిత్రీకరించారట. ఐష్‌, అభిషేక్‌ సెట్స్‌లో కనిపించడం తమకు చాలా ఆనందాన్నిచ్చిందని ‘జజ్‌బా’ క్రూ అంటున్నారు. అక్టోబర్‌లో ఈ ‘జజ్‌బా’ విడుదల కానుంది.

మరిన్ని సినిమా కబుర్లు
The perfect time to exploit the highly commendable