Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష

movie review

చిత్రం: అవును-2
తారాగణం: హర్షవర్ధన్‌ రాణే, పూర్ణ, రవిబాబు, సంజన, నిఖిత తుర్కల్‌ తదితరులు
చాయాగ్రహణం: భూపేష్‌ ఆర్‌ భూపతి
సంగీతం: శేఖర్‌ చంద్ర
నిర్మాణం: సురేష్‌ ప్రొడక్షన్స్‌, ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌
దర్శకత్వం: రవిబాబు
నిర్మాతలు: రవిబాబు, సురేష్‌ బాబు
విడుదల తేదీ: 3 ఏప్రియల్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే
‘అవును’ సినిమాకి సీక్వెల్‌ ఇది. దెయ్యం నుంచి తప్పించుకుని, క్షేమంగా బయటపడ్డ హర్ష (హర్షవర్ధన్‌), మోహిని (పూర్ణ) కాశీకి వెళతారు. అక్కడ ఓ సాధువు మోహినికి మహిమగల తాడుని ఇస్తాడు. దాన్ని చేతికి కట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని చెబుతాడు. ఆ తర్వాత హర్ష, మోహిని తమ తమ పనుల్లో బిజీ అయిపోతారు. అయితే మళ్ళీ కెప్టెన్‌ రాజు (రవిబాబు) ఆత్మ, మోహినిని భయపెట్టడం మొదలు పెడ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరపై చూడాల్సిన కథ.

మొత్తంగా చెప్పాలంటే
నటుడిగా సినిమా సినిమాకీ మెచ్యూరిటీ ప్రదర్శిస్తున్నాడు హర్షవర్ధన్‌ రాణే. ఈ సినిమా నటన పరంగా హర్షవర్ధన్‌కి మంచి పేరు తెస్తుంది. గ్లామరస్‌గానే కాకుండా, నటిగానూ మంచి మార్కులేయించుకుంది పూర్ణ. నిఖిత, సంజన మామూలే. రవిబాబు ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర ఫర్వాలేదన్పించారు. సీక్వెల్‌ని తెరకెక్కించాలంటే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. తర్వాత ఏం జరిగిపోతుందో అర్థమవుతున్నా స్క్రీన్‌ప్లేతో దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్‌గా మలిచాడు. డైలాగ్స్‌ ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ నిరాశపరిచింది. సినిమాటోగ్రపీ సినిమాకి ప్రధాన బలం. ఎడిటింగ్‌ బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ సినిమాలోని థ్రిల్లర్‌ మూడ్‌లోకి ఆడియన్స్‌ని తీసుకెళ్ళేలా ఉన్నాయి. ఫస్ట్‌ పార్ట్‌లో థ్రిల్లింగ్‌ సీన్స్‌ చాలానే ఉన్నాయి. అయితే సీక్వెల్‌ సినిమాలో షాకింగ్‌ ఎలిమెంట్స్‌ తక్కువగా ఉన్నాయి. పస్టాఫ్‌ బోరింగ్‌గానే సాగుతుంది. డ్రాగింగ్‌ అనిపిస్తుంది కూడా. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ బాగానే వుంది. సెకెండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. కొన్ని సన్నివేశాలు ఆడియన్స్‌ని చాలా థ్రిల్లింగ్‌కి గురిచేస్తాయి. సినిమాలో ఇన్‌వాల్వ్‌ అయ్యేలా చేస్తాయి. క్లయిమాక్స్‌ని స్మూత్‌గా డీల్‌ చేసి వుండాల్సింది. ఓవరాల్‌గా సినిమా ఆకట్టుకుంటుంది. బడ్జెట్‌ పరిమితుల్ని అనుసరించడంతో సినిమా సేఫ్‌ వెంచర్‌ అవడమే కాదు, ప్రాఫిట్‌ గ్రాసర్‌ అయ్యే అవకాశం కూడా ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
‘అవును’ ఓసారి చూడొచ్చు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
interview