Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Garjistonna Lion

ఈ సంచికలో >> సినిమా >>

సిసింద్రీ కాదది అక్కినేని మిస్సైల్‌

Akkineni Missail

బక్కగా పీలగా ఉన్నాడనీ, క్లాస్‌ లుక్‌లో చాలా సాఫ్ట్‌గా ఉన్నాడనీ అఖిల్‌ గురించి ఎవరైనా అనుకుంటే అది నిన్నటిదాకా మాత్రమే. ఫస్ట్‌ సినిమా టీజర్‌లో అఖిల్‌ చూపించిన దమ్ముతో అతని మీద అంచనాలు పెరిగిపోయాయి. మాస్‌ సినిమాలు తీయడంలో దిట్ట అయిన వినాయక్‌, అక్కినేని కుటుంబం నుంచి వస్తోన్న హీరోని ఎలా లాంఛ్‌ చెయ్యాలో పక్కాగా ప్లాన్‌ చేసుకున్నాడు.

అఖిల్‌ పుట్టినరోజున విడుదలైన మేకింగ్‌ వీడియోలో, అఖిల్‌ పవర్‌ చూపించాడు. మేకింగ్‌ వీడియోలా లేదిది, సినిమా టీజర్‌లా పవర్‌ఫుల్‌గా ఉంది. ఆ ఫైట్స్‌ ఏంటి? ఆ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఏంటి? ఆ కాన్ఫిడెంట్‌ నేచర్‌ ఏంటి? అని ఆశ్చర్యపోయారు ఒకప్పటి సిసింద్రీని చూసి తెలుగు సినీ ప్రేక్షకులు.

మేకింగ్‌ వీడియో లేదా టీజర్‌ ఏదన్నా అనండి, అక్కినేని అఖిల్‌ ఇరగదీశాడు. సిసింద్రీ కాదది మిస్సైల్‌ అని అభిమానులు డిసైడ్‌ అయిపోయారు. తమ ముందుకు హీరోగా అఖిల్‌ ఎప్పుడొస్తాడా? అనే ఉత్కంఠ అభిమానుల్లో పదింతలయ్యింది. యంగ్‌ హీరో నితిన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మిస్సైల్‌లా దూసుకురానున్న అఖిల్‌, తొలి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తాడో చూడాలి.

మరిన్ని సినిమా కబుర్లు
Manchu Lakshmi sing a song for Dongata