Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Manchu Lakshmi sing a song for Dongata

ఈ సంచికలో >> సినిమా >>

కొడుకు సినిమాకి తండ్రి డైరెక్షన్‌

Father direction in son movie

మెగా మేకర్‌గా సక్సెస్‌ఫుల్‌ సినిమాలు నిర్మించిన ఎంఎస్‌ రాజు, దర్శకుడిగా విజయాలు అందుకోలేకపోయారు. మెగా ఫోన్‌ పట్టుకుని పరాజయం చవిచూడటమే కాకుండా, నిర్మాతగా కూడా వెనకబడ్డారీయన. ఎంఎస్‌ రాజు తనయుడు సుమంత్‌ అశ్విన్‌, నటుడిగా ఓకే అనిపించుకున్నాడే తప్ప, యంగ్‌ హీరోలతో పోటీలో తడబడుతున్నాడు.

తన కొడుక్కి హిట్‌ ఇవ్వాలనే కసితో ఉన్న ఎంఎస్‌ రాజు, స్వీయ నిర్మాణంలో సుమంత్‌ అశ్విన్‌ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. కథ సిద్ధమయ్యిందనీ, సినిమా అనౌన్స్‌మెంట్‌ కోసం రాజుగారు మంచి ముహూర్తం చూసుకుంటున్నారని ఇండస్ట్రీలో న్యూస్‌ వినిపిస్తోంది.

యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టోరీని కొడుకు సుమంత్‌ అశ్విన్‌ కోసం ఎంఎస్‌ రాజు సిద్ధం చేశారట. కుటుంబ కథా చిత్రాల ట్రెండ్‌ నడుస్తుండడంతో, ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా నచ్చేలా ఈ ప్రేమకథ ఉండబోతోందట. మంచి చిత్రాల నిర్మాతగా పేరున్న ఎంఎస్‌ రాజు, సెంటిమెంట్‌ పాళ్ళు తగ్గించి, ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఆధారంగా చేసుకుని సుమంత్‌ అశ్విన్‌తో చేయనున్న సినిమా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయట.

మరిన్ని సినిమా కబుర్లు
Performance Opportunities