‘గంగ’ సినిమాలో నటించమని దర్శకుడు లారెన్స్ తనను అడగగానే ఆలోచించాననీ, కథ విన్నాక కూడా సినిమా చేస్తాననే మాట చెప్పలేకపోయానని అంటుంది తాప్సీ. తర్వాత ఆలోచించి, సినిమా చేయడానికి ఒప్పుకున్నానంటున్న తాప్సీ, దర్శకుడు లారెన్స్‌ని గుడ్డిగా నమ్మాననీ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సమయంలో ‘ఈ సినిమా చేయకపోయి వుంటే చాలా కోల్పోయేదాన్ని’ అనిపిస్తుందని చెప్పింది. ‘గంగ’ సినిమా క్రెడిట్ అంతా లారెన్స్‌దేనట. సినిమాలో తన పాత్రకు చాలా గుర్తింపు వస్తుందని అంటూ, ఆ క్రెడిట్ కూడా లారెన్స్‌కే దక్కుతుందని తాప్సీ అంటుంది. ఒక్కోసారి తన పాత్రని తలచుకుంటే తనకే భయం వేసేదని సెట్స్‌లో భయం లేకపోయినా, షూటింగ్ ప్యాకప్ చెప్పిన తర్వాత భయం వేసేదని, ఇప్పుడు తలచుకుంటే అంతా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందని తాప్సీ వెల్లడిరచింది. లారెన్స్, తాప్సీ కాంబినేషన్‌లో రూపొందిన ‘గంగ’ విడుదలకు సిద్ధమవుతోంది.
|