Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tapsee believe larence

ఈ సంచికలో >> సినిమా >>

ఐటమ్‌ నంబర్‌ అంటే చిన్నచూపా?

no like to item number


తెలుగులో మహేష్‌, వెంకటేష్‌లతో సినిమాలు చేసిన బాలీవుడ్‌ భామ ప్రీతి జింటాకి ఐటమ్‌ సాంగ్స్‌ అంటే అస్సలు ఇష్టం ఉండదట. సల్మాన్‌ఖాన్‌తో ఓ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేశారు కదా? అనడిగినప్పుడు, అది సల్మాన్‌ఖాన్‌తో ఉన్న స్నేహం వల్లే సాధ్యమయ్యిందనీ అది ఐటమ్‌ సాంగ్‌ కాబోదని, ప్రత్యేక గీతం మాత్రమేనని ప్రీతి జింటా సమాధానమిచ్చింది. ఛీ, నన్ను ఐటమ్‌ నంబర్‌ అంటారా? అని ప్రీతి జింటా అనడం పట్ల ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తూ కెరీర్‌లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న అందాల భామలకు చిర్రెత్తుకొచ్చింది. ఐటమ్‌ నంబర్‌ అంటే అంత చిన్నచూపా? అని ప్రీతి జింటాని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక గీతాలు అనే పదం సాఫ్ట్‌, ఐటమ్‌ నంబర్‌ అనడం మాస్సీ. రెండిటికీ తేడా ఏమీ ఉండదని ఐటమ్‌ బాంబ్స్‌ ప్రీతి జింటా వ్యాఖ్యలపై స్పందింస్తూ చెప్పారు. కత్రినాకైఫ్‌, ప్రియాంకా చోప్రా, కరీనాకపూర్‌, ఐశ్వర్యారాయ్‌ లాంటి తారలే ఐటమ్‌ సాంగ్స్‌ చేసినప్పుడు ప్రీతి జింటా, వీటిపై నిర్లక్ష్యంగా మాట్లాడటంలో అర్థం లేదు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam