Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaluguyugalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతిష్యం విజ్ఞానం - శ్రీకాంత్

 

నక్షత్రాలు జ్యోతిషంలో ప్రధాన్యామైనవా ?

ప్రకృితిలోని పండువెన్నెల, మెరిసే ఆకాశం మానవుని మనసును ఆహ్లాదపరుస్తుంది. నిత్యం ఆకాశంలో మినుకు మినుకు మనే నక్షత్రాలు మన మనసకు ప్రశాంతతనిస్తాయి. చిన్నప్పుడు అందరం నక్షత్రాలను లెక్కపెట్టడానికి ప్రయత్నించిన వాళ్లమే. కానీ ఆనక్షత్రాలకు మన జీవితానికి ఉన్న సంబంధాన్ని జ్యోతిష్యాస్త్రం చెప్తోెంది. అలానే ఖగోళంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. రవిమార్గంలో 27 భాగాలుగా విభజన చేస్తూ ఈ మార్గంలో మాత్రమే కాకుండా ఆ నక్షత్రాలలోని కొన్ని భాగాలను కలుపుతూ 12 రాశులుగా విభజన కనిపిస్తుంది.

జ్యోతిషంలోని నక్షత్రాలు :-

మొత్తం 27 నక్షత్రాలు అశ్విని,భరణి,కృత్తిక ,రోహిణి,మృగశిర.... మొదలు పూర్వాభాద్ర ,ఉత్తరాభాద్ర ,రేవతి వరకు. ప్రతిరాశిలో మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాల చొప్పున మన పూర్వీకులు విభజన చేయడం జరిగింది.

మొదటగా మేషరాశిని పరిశీలిస్తే మేషంలో అశ్వని ,భరణి,కృత్తిక మొదటి పాదం ఉంటుంది. అశ్వినికి అశ్విని దేవతలు , భరణికి యముడు , కృత్తికకు అగ్నిదేవుడు అధిదేవతలు. దీనికి లాటిన్ ఎరిస్ అని పేరు. అశ్విని చుక్కలు గుర్రపు తల ఆకారాన్ని కలిగి ఉంటుంది. వేదంలో అశ్వని నక్షత్ర  ప్రస్థావన అలాగే మంత్రం మనకు కనభడుతుంది. భరణి పోయిరాళ్ళుగా మూడుచుక్కల సమూహం. కృత్తిక నక్షత్రం మంగళికత్తి ఆకారంలో ఉంటుంది.

జ్యోతిషంలో మేషరాశి నక్షత్రాలు :-

మేషం అనగా గొర్రె అనర్థం. అగ్నికి వాహనం. హిందూదేవతలలో కార్తికేయుడు కృత్తికలో జన్మించాడు. మేషరాశికి అధిపతి కుజుడు. నవగ్రహలకు అధిపతి అయిన రవి మేషంలో ఉచ్చస్థితిని పొందుతాడు. మేషరాశి చరరాశి, అశ్విని నక్షత్రానికి గ్రహాలరిత్యా కేతువు అధిపతి. భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి, కృత్తిక నక్షత్రానికి రవి అధిపతి. చంద్రుడు అశ్విని,భరణి, కృత్తికమొదటి పాదంలో జన్మించిన మేషరాశికి చెందినవాడు అవుతాడు. కాలపురుషిని అంగంలో తలను సూచిస్తుంది.

వృషభం :-

రాశులలో రెండవది వృషభం. ఈ రాశిలో క్రుత్తికలొని మూడుపాదాలు, రోహిణి ,మృగశిరలోని రెండు పాదాలు వస్తాయి. కృత్తికనక్షత్రం అరుచుక్కల సమూహం. రోహిణి నక్షత్రంలో అయిదు చుక్కలు ఉంటవి. రోహిణి నక్షత్రం ఉదయించేటప్పుడు A అక్షరం మాదిరిగా అస్తమించేటప్పుడు v అక్షరం మాదిరిగా కనభడుతుంది. రోహిణికి ఆధిదైవం ప్రజాపతి. రోహిణి నక్షత్రాన్ని ప్రజాపతికి కూమర్తెగా మన పురాణాలు తెలియజేసాయి.  మృగశిరానక్షత్రం మృగం ఆకారంలో ఉంటుంది. దీనికి అధిదేవత సోముడు. కొంతమంది యజ్ఞోపవీతాన్ని ధరించిన పురుషుడు అని మరికొందరు మృగరూపం దాల్చిన ప్రజాపతి అన్నారు.

జ్యోతిషంలో వృషభరాశి నక్షత్రాలు :-

వృషభం అనగా ఎద్దు అని అర్థం. వృషభరాశికి అధిపతి చంద్రుడు. వృషభం చంద్రుడు ఉచ్చస్థితిని పొందుతాడు. వృషభరాశి స్థిరరాశి. జాతకుడు చంద్రుడు కృత్తిక 2,3,4,పదాలలో రోహిణి, మృగశిర 1,2 పదాల్లో సంచరిస్తున్నపుడు జన్మిస్తే వృషభరాశికి చెందుతాడు. కాలపురుషుని అంగంలో మెడను సూచిస్తుంది. గ్రహాల రిత్యా క్రుత్తికకు రవి, రోహిణికి చంద్రుడు . మ్రుగాశిరకు కుజుడు అధిపతులు.  
మరిన్ని శీర్షికలు
humour interview