Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

హిట్టు కొట్టాలన్న కసితో ఎన్టీఆర్‌

ntr wants to hit
విలక్షణ చిత్రాల దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న యన్టీఆర్‌ కొత్త సినిమా 'నాన్నకు ప్రేమతో'. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కధానాయికగా నటిస్తోంది ఈ సినిమాలో. సినిమాలో హీరో పాత్ర మాస్‌ మెచ్చేలా పవర్‌ఫుల్‌గా ఉంటూనే, అవసరమైన సందర్భాల్లో ఎమోషనల్‌ సీన్స్‌తో ఎన్టీఆర్‌ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసుల్ని గెలచుకునేలా ఉంటుందట.

డిఫరెంట్‌ గెటప్‌, సెటప్‌తో వస్తూ ఇప్పటికే సినిమా మీద అంచనాలు ఫలానా అనుకునేట్టుగా జనంలో పబ్లిసిటీ క్రియేట్‌ అయిపోయింది ఈ సినిమాపై. లక్కీ గాళ్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గ్లామర్‌ ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ అవుతుందనడం నిస్సందేహం. టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఈ కోవలో 'అత్తారింటికి దారేది', 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి', 'శ్రీమంతుడు' పెద్ద విజయాలు సాధించాయి. వాటి సరసన 'నాన్నకు ప్రేమతో' చేరుతుందని ఎన్టీఆర్‌ అభిమానులు విశ్వసిస్తున్నారు. అభిమానుల అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా సినిమాని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడట. 
మరిన్ని సినిమా కబుర్లు
jagapatibabu act  serials in small screen