Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
The value is difficult to know says rakul

ఈ సంచికలో >> సినిమా >>

ప్రభాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ

prabhas bolly wood entry
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకునే స్థాయికి చేర్చింది 'బాహుబలి' సినిమా ఘనత. ఇక ఈ సినిమాలోని హీరో ప్రభాస్‌ సంగతి అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. టాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హంక్‌, బాలీవుడ్‌కి సూటయ్యే పర్సనాలిటీతో ఇరగదీశాడు 'బాహుబలి'లో. ఫస్ట్‌ పార్ట్‌ కన్నా రెండో పార్ట్‌లోనే ప్రభాస్‌ హీరోయిజం ఎక్కువ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభాస్‌ గురించి 'బాహుబలి' ఫస్ట్‌ పార్ట్‌తోనే బాలీవుడ్‌లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

రాజమౌళి టేకింగ్‌తో సమానంగా ప్రభాస్‌ టాలెంట్‌ గురించి మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకోవడమే కాకుండా ప్రభాస్‌తో డైరెక్ట్‌గా హిందీ సినిమా చేస్తే ఎలా ఉంటుందని కూడా కొందరు ప్లానింగ్స్‌ వేస్తున్నారుట బాలీవుడ్‌లో. ప్రభాస్‌ వద్దకు ఇలాంటి ఆఫర్స్‌ 'బాలీవుడ్‌' తర్వాత చాలానే వచ్చినా 'బాహుబలి' సెకెండ్‌ పార్ట్‌ తర్వాతే దేనిగురించి అయినా ఆలోచించాలని ప్రభాస్‌ అనుకుంటున్నాడు. 'బాహుబలి' సెకెండ్‌ పార్ట్‌ తర్వాత ప్రభాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమైందని సమాచారమ్‌. 
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam