Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
talent not enough

ఈ సంచికలో >> సినిమా >>

ఆలీకి పవన్‌తో తొలి పరిచయం అలా అయ్యింది

ali intruduction with  pavan
పవన్‌ కళ్యాణ్‌కి, ఆలీకి మధ్య ఉన్న అనుబంధం, ఫ్రెండ్‌ఫిప్‌ గురించి అందరికీ తెలిసిందే. చాలా సార్లు అనేక ఆడియో ఫంక్షన్స్‌లో పవన్‌, ఆలీ గురించి, ఆలీ, పవన్‌ గురించి గొప్పగా చెబుతూ ఉండడం కూడా తెలిసిన విషయమే. అయితే వీరిద్దరి పరిచయం చాలా విచత్రంగా జరిగింది. 'ముగ్గురు మొనగాళ్లు' సినిమా షూటింగ్‌ టైంలో వర్షంలో షూటింగ్‌ చేసి అలసిపోయి జ్వరంతో బాధపడుతున్న చిరంజీవిని చూడ్డానికి వచ్చిన అలీని ఇంట్లో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ఎంతో ఆప్యాయంగా పలకరించాడట. అదే వారిద్దరి తొలి పరిచయమట.

అప్పటికి పవన్‌ ఇంకా సినిమాల్లోకి రాలేదు. కానీ అలీ అప్పటికే చాలా సినిమాలు చేసేశాడు. ఆ తర్వాత పవన్‌ సినీ ఎంట్రీ జరిగిన తర్వాత ఆనాటి నుండి, నేటి వరకూ ఆలీ లేకుండా పవన్‌ సినిమా లేదు. చాలాసార్లు పవన్‌ ,ఆలీ నా గుండెకాయ' అని చెప్పడం కూడా విశేషం. అయితే బుల్లితెర ప్రోగ్రాం 'అలీతో జాలీగా'కి గెస్ట్స్‌గా వచ్చిన 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' టీంలో సాయిధరమ్‌తేజ్‌ ఆలీని చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లలో ఎవరంటే మీకు బాగా ఇష్టం అని అడిగితే ఆలీ చిరంజీవిగారంటేనే బాగా ఇష్టం అని చెప్పాడు. ఎందుంటే ఆయన ద్వారానే నాకు పవన్‌ కళ్యాణ్‌ పరిచయం అయ్యాడు అని ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. 
మరిన్ని సినిమా కబుర్లు
rashi ready to act aunty roles...