Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ali intruduction with  pavan

ఈ సంచికలో >> సినిమా >>

అత్త పాత్రలకు సై అంటోన్న హీరోయిన్‌

rashi ready to act aunty roles...
నాటి నుండి నేటి వరకూ గ్లామర్‌ అత్త పాత్రలకు ఎంతో క్రేజ్‌ ఉంది. నాటి కాలంలో వాణిశ్రీ, జయంతి, లక్ష్మీలు తమ అత్త క్యారెక్టర్స్‌తో ఒక ట్రెండ్‌ సృష్టిస్తే, ఆ తరువాతి కాలంలో నగ్మా, రమ్యకృష్ణలు కూడా అత్త పాత్రలకు మరింత గ్లామర్‌ తీసుకొచ్చారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలోని నదియా నటించిన అత్త పాత్రకు వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు.

ఇప్పుడు అదే కోవలోకి చేరడానికి తాను కూడా సిద్ధం అంటోంది హీరోయిన్‌ రాశి. పెళ్లి చేసుకుని, ఒక పాపకి తల్లయ్యాక రాశి కొంచెం ఒళ్లు పెంచేసి, బొద్దుగా తయారయ్యింది. కానీ ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు బుల్లితెరలో 'మా టాకీస్‌' అనే ప్రోగ్రాంకి అత్తగారి గెటప్‌లో హూస్ట్‌గా వ్యవహరిస్తోంది. అంటే ఆమె ఆల్రెడీ అత్త పాత్రకి రిహార్సల్‌ చేస్తోందన్న మాట. డైరెక్టర్‌ ఎవరైనా అవకాశం ఇస్తే ఇప్పటి యువహీరోలకి అత్తగా నటించి, మెప్పించడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం ఆమె కోరిక ఎవరి ద్వారా నెరవేరుతుందో? ఆల్‌ ది బెస్ట్‌ రాశి. 
మరిన్ని సినిమా కబుర్లు
non stop entertainment