Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nani act in maniratnam direction

ఈ సంచికలో >> సినిమా >>

అక్కినేని వారసలు మళ్ళీ ఒకేసారి తెరపై

akkineni family at a time on screen
'అక్కినేనీ అక్కినేనీ..' అంటూ సాగే 'అఖిల్‌' చిత్రంలోని పాటకి ఓ స్పెషాలిటీ ఉందంటున్నారు. ఆ స్పెషాలిటీ ఏంటంటే, అక్కినేని నాగార్జున తన ఇద్దరు తనయులు అఖిల్‌, నాగచైతన్యతో కలిసి 'అక్కినేనీ..' పాటలో ఆడి పాడతారట. వినాయక్‌ దర్శకత్వంలో అక్కినేని అఖిల్‌ హీరోగా 'అఖిల్‌' సినిమా రూపొందుతోంది. ఈ దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది 'అఖిల్‌' సినిమా. హీరో నితిన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, పాటలు ఇప్పటికే విడుదలై చార్ట్‌ బస్టర్స్‌లో సూపర్‌ హిట్‌ అనిపించుకున్నాయి. 

సాంగ్‌ టీజర్స్‌లో అఖిల్‌ డాన్సులు దుమ్మురేపేశాడు. ఫుల్‌ సాంగ్స్‌ చూస్తే అక్కినేని అఖిల్‌ డాన్సులకి ఎవరైనా ఫ్లాట్‌ అవ్వాల్సిందేనట. శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై 'అఖిల్‌' చిత్రం నిర్మితమవుతోంది. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్‌ పాల్గొనే పాట చిత్రీకరణ విశ్లేషాలు అక్కినేని అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. 'మనం' సినిమాలో సీనియర్‌ అక్కినేనితోపాటు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ ఒకేసారి తెరపై కనిపించి అభిమానుల్ని అలరించారు. 
మరిన్ని సినిమా కబుర్లు
cheekatirajyam  movie  reach in  holly wood  thrillar