మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్న సినిమాకి సంబంధించిన ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. 'కత్తి' సినిమా రీమేక్‌లో చిరంజీవి నటించవచ్చన్నది ఇంకా ఊహాగానంగానే మిగిలిపోయింది. 'బ్రూస్‌లీ' ఆడియో రిలీజ్‌కి ముందు రోజే 'కత్తి' సినిమా రీమేక్ వార్తల్లోకెక్కింది. కానీ, ఆ వేదికపైనుంచి చిరంజీవి 'కత్తి' సినిమాపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. దసరా సందర్భంగా చిరంజీవి తన కొత్త సినిమాపై అనౌన్స్‌మెంట్ ఇచ్చే అవకాశముందంటూ ఇంకో ప్రచారం మొదలైంది. అది కాదంటే, 'బ్రూస్‌లీ' రిలీజ్‌కి సరిగ్గా ఒక్క రోజు ముందు చిరంజీవి, 'కత్తి' రీమేక్‌పై స్పష్టత ఇవ్వొచ్చని కూడా అంటున్నారు.
'కత్తి' తమిళంలో ఘనవిజయం సాధించిన సినిమా. మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగులో వినాయక్ దర్శకత్వంలో 'కత్తి' రానుందట. దానికి మురుగదాస్ కథ పరంగా కొన్ని మెరుగులు కూడా దిద్దినట్లు సమాచారమ్. ఇది కాకుండా ఓ బాలీవుడ్ సినిమా రీమేక్ గురించీ చిరంజీవి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారమ్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని చిరంజీవి కోరుకుంటున్నారట. ఏదేమైనా రానున్న రోజుల్లో చిరు సినిమాపై స్పష్టత రావొచ్చునట.
|