Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
clarity on chiru movie.

ఈ సంచికలో >> సినిమా >>

అదీ అల్లు అర్జున్‌ అంటే

that is allu arjun.
తనతో ఫ్లాప్‌ సినిమా తీసిన డైరెక్టర్‌ని మళ్ళీ కలిసి అవకాశం అడిగాడంటేనే ఆ దర్శకుడిపై ఆ హీరోకి ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. అడిగిన హీరో అల్లు అర్జున్‌ అయితే, ఆ దర్శకుడు గుణశేఖర్‌. విలక్షణ చిత్రాల దర్శకుడు గుణశేఖర్‌, తెలుగులో ఉన్న అతి కొద్దిమంది క్రియేటివ్‌ దర్శకుల్లో ఒకడు. 'ఒక్కడు', 'చూడాలని ఉంది' లాంటి అద్భుత చిత్రాలు తీసిన గుణశేఖర్‌, అల్లు అర్జున్‌తో 'వరుడు' అనే ఫ్లాప్‌ మూవీని తీశాడు. 'వరుడు' ఫ్లాప్‌ అయినా గుణశేఖర్‌తో, అల్లు అర్జున్‌ స్నేహం కొనసాగింది. దానికి గుర్తుగా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది.

'రుద్రమదేవి' సినిమాలోని గోన గన్నారెడ్డి పాత్రను తాను చేస్తానని అడిగి మరీ చేశాడు అల్లు అర్జున్‌. మల్టీస్టారర్‌ సినిమాలతో సినిమా రేంజ్‌ పెరుగుతుందని నమ్మే అల్జున్‌, కొన్ని సినిమాల కోసం తనకున్న స్టార్‌ ఇమేజ్‌ని పక్కన పెడ్తాడు. 'వేదం' అలా చేసిన సినిమానే. 'ఎవడు' సినిమాలో కాస్సేపే కన్పించినా, బన్నీ ఇంపాక్ట్‌ సినిమా అంతా ఉంటుంది. భవిష్యత్తులో తెలుగులో ఇంకా చాలా మల్టీస్టారర్స్‌ రావాలి, దక్షిణాది హీరోలు, బాలీవుడ్‌ హీరోలతో కలిసి వరుసగా సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్న బన్నీ మాట నిజమవ్వాలని కోరుకుందాం. 
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam