Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sudheer babu

ఈ సంచికలో >> సినిమా >>

'నేను శైలజ'పై పెరుగుతున్న ఎక్స్‌పెక్టేషన్స్‌

nenu shailaja

రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న 'నేను శైలజ' ఆడియో మార్కెట్‌లోకి వచ్చేసింది. పాటలు బాగున్నాయనే టాక్‌ వచ్చింది. ట్రైలర్‌కూడా ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్‌కి మంచి స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఉందని ట్రైలర్‌ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఇందులో హీరో రామ్‌ లుక్‌ కొత్తగా డిజైన్‌ చేసినట్టున్నారు. క్లాస్‌ లుక్‌తో కొంచెం మాస్‌ టచ్‌తో ఎట్రాక్టివ్‌గా అతని క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశారని అర్థమవుతోంది. డాన్సుల్లో రామ్‌కి వంకపెట్టడానికేముంది?

ఈ సినిమాలో కూడా డాన్సులు చాలా బాగా చేశాడని సాంగ్‌ టీజర్స్‌ని బట్టి తెలుస్తుంది. డిఫరెంట్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సినిమా పాటలు కూడా డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. టోటల్‌గా డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా రామ్‌కు విజయం తెచ్చిపెట్టేలానే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు బాగా పెరుగుతున్నాయి. జనవరి 1న విడుదల కానున్న ఈ సినిమాతోనే న్యూఇయర్‌కు వెల్‌కమ్‌ చెప్పనున్నాడు రామ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam