Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
lavanya tripati got  double dhamaka

ఈ సంచికలో >> సినిమా >>

సోగ్గాడి సందడే సందడి

soggadi celebrations...

టాలీవుడ్‌ అందగాడు నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా సంక్రాంతి పండుగతో పాటు సినిమా పండగను కూడా వెంట తీసుకొచ్చింది. సంక్రాంతికి నిజమైన పండుగలాంటి సినిమా సోగ్గాడు అని నాగార్జున ముందునుంచీ నమ్మకంగా చెబుతున్నారు. దానికి తగ్గట్టే సినిమాపైనా అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. తన సినిమాలను ఎక్కువగా డిశంబర్‌లో విడుదల చేసేందుకు ఇష్టపడే నాగార్జున ఈ సినిమాను సంక్రాంతికి 'సోగ్గాడి'ని తీసుకొచ్చారు.

అఖిల్‌ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ కోసం అడిగితే 'అఖిల్‌' మొదటి సినిమా నిరాశపరచడంతో కొంత కాలం గ్యాప్‌ తీసుకొమ్మని సలహా ఇచ్చారట నాగ్‌. నాగార్జున కూడా ఈ సినిమా తరువాత నెక్స్ట్‌ సినిమాల కోసం మరి కొంచెం గ్యాప్‌ తీసుకుని, కొత్త కథల కోసం అన్వేషిస్తారట. అందులో నచ్చిన కథలను ఫస్ట్‌ అఖిల్‌ కోసం ఎంపిక చేస్తారట. ఆ తరువాత తన ప్రాజెక్ట్‌ గురించి ఆలోచిస్తారట. కొత్త డైరెక్టర్స్‌ దగ్గర ఆలోచనలు కొత్తగా ఉంటాయి. అందుకే నాకు కొత్త డైరెక్టర్స్‌తో సినిమాలు చేయడమంటే ఇష్టం. ఈ సీక్రెట్‌ తెలిసిన వాణ్ణి కాబట్టే నేను ఇంకా యంగ్‌గానే కనిపిస్తున్నాను అంటున్నాడు కింగ్‌ నాగార్జున. ఇద్దరు తనయులూ హీరోలుగా పరిచయమైనా నాగ్‌లో గ్లామర్‌ ఇంకా తగ్గలేదు. దటీజ్‌ నాగార్జున. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam