నెంబర్ వన్ హీరోయిన్‌గా దాదాపు అందరు సీనియర్ హీరోల పక్కన హీరోయిన్‌గా నటించింది తమన్నా. ఇంకా నటిస్తూనే ఉంది. తాజాగా 'ఊపిరి' సినిమాతో విజయాన్ని అందుకుంది. ప్రభాస్‌తో 'బాహుబలి' సినిమా ద్వారా హీరోయిన్‌గా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. బాలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ కూడా తన హవా చూపిస్తోంది. కానీ తమన్నాకి ఈ మధ్య విచిత్రమైన కోరిక పుట్టిందట. కుర్రహీరో నానితో నటించాలనుందన్న తన మనసులోని మాటను ఈ రకంగా బయట పెట్టింది. నేచురల్ నటనతో ఆకట్టుకునే నాని అంటే తనకెంతో ఇష్టమనీ, అందుకే ఛాన్స్ ఉంటే కనుక నానితో నటించాలనుందనీ తెలిపింది. ఇంకేం నానికి కూడా తమన్నా అంటే చాలా ఇష్టమని ఎన్నో సార్లు చెప్పాడు. ఇక తమన్నా వైపు నుండి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక త్వరలో ఈ జంట తెరపై సందడి చేసే అవకాశాలున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా అంత పెద్ద హీరోయిన్ రేంజ్‌లో ఉండి తమన్నాకు ఇలాంటి ఆలోచన వచ్చినందుకు ఆమెను మెచ్చుకోకుండా ఉండలేము సుమీ. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిన తమన్నా, నానితో నటించాలని ఉందని చెప్పడం గొప్ప విషయమే. అయినా నాని ఏం తక్కువోడు కాదు. హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. ఓవర్సీస్ మార్కెట్‌లో స్టార్ హీరోలని మించిపోయాడీ యంగ్ హీరో.
|