Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mahesh ugadi gift adurs

ఈ సంచికలో >> సినిమా >>

నాని కొత్త సినిమా 'ఎవడితడు?'

nani new flim evaditadu?

వరుస హిట్లతో దూసుకెళ్లిపోతున్నాడు నాచురల్‌ హీరో నాని మరో హిట్‌కి రెడీ అయిపోతున్నాడు. 'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌ కొట్టాడు. ఆ విజయాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' అంటూ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక హ్యట్రిక్‌ కొట్టడమే తరువాయి. అందుకూ రెడీ అంటున్నాడు. 'అష్టాచమ్మా' సినిమా డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఒక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రొమాంటిక్‌ ధ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోన్న ఈ సినిమాకు 'ఎవడితడు?' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో 'రన్‌ రాజా రన్‌' సినిమాతో విజయాన్ని అందుకున్న సురభి హీరోయిన్‌గా నటిస్తోంది. మళయాళీ ముద్దుగుమ్మ నివేద థామన్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే యోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. రొటీన్‌కి భిన్నంగా వెరైటీ చిత్రాల్ని ఎంపిక చేసుకుంటూ విజయాల్ని సొంతం చేసుకుంటున్న నానికి హేట్సాఫ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
chiru kattilantodu