పవనిజం ఎలా ఉంటుందో పవన్‌కళ్యాణ్ సినిమా రిలీజయిన తొలి రోజు థియేటర్లకు వెళితే తెలుస్తుంది. ఆ పవనిజంలో అభిమానులు మునిగి తేలుతారు. తమ అభిమాన హీరో సినిమా చూడ్డానికి ఎంత ఖర్చయినా లెక్క చేయరు. అభిమానులంతా కలిసి తమ అభిమాన హీరో సినిమా చూడ్డానికి బెనిఫిట్ షోలను ఏర్పాటు చేసుకుంటారు.
అలా ‘అత్తారింటికి దారేది’ సినిమాకి కూడా బెనిఫిట్ షోలు జరగబోతున్నాయి. వీటి కోసం టిక్కెట్ రేట్లను 1000 రూపాయలు అని అనుకుంటున్నారట. ‘జల్సా’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో పవన్ నటిస్తున్న సినిమా కావడం, సినిమాకి ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ రావడంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
సో, బెనిఫిట్ షో ప్లానింగ్స్‌లో అభిమానులు బిజీగా వున్నారు. ఎన్ని షోలు పెట్టినా ఫిలప్ అయ్యేంత అభిమానం అభిమానుల్లో వుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో సినిమా విడుదల కాబోతోంది. సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.
|