Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
gautamiputra satakarni song superb

ఈ సంచికలో >> సినిమా >>

సీనియర్‌ అయిపోయిన సమంత

samanta was senior

సమంత అంటేనే ఏదో మాయ . కేవలం అబ్బాయిలకే కాదు, టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలకు కూడా సమంత ఒక్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌. ఆమెలో తమను తాము చూసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు అమ్మాయిలు. ఆమెను అనుకరించాలనుకుంటుంటారు.మొదటి సినిమా నుండీ అదే మాయ కొనసాగిస్తూ వస్తోంది సమ్మూ బ్యూటీ. ఈ ఏడాది సమ్మర్‌ అంతా సమంత నవ్వుతో కూల్‌ కూల్‌గా గడిచిపోతోంది. ఇప్పటికే విడుదలైన విజయ్‌తో 'పోలీస్‌', సూర్యతో '24' సినిమాలతో సందడి చేస్తోంది సమంత.

త్వరలో నితిన్‌తో 'అఆ'తోనూ, మహేష్‌తో బ్రహ్మూెత్సవం'తోనూ మన ముందుకు రానుంది. 'బ్రహ్మూెత్సవం'లో తనకు పోటీగా సీనియర్‌ నటీమణులు ఎంత మంది ఉన్నా తన పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుందంటోంది సమంత. అలాగే 'అఆ' సినిమాలో సమంతలోని కొత్త కోణాన్ని చూస్తారంటోంది. తాను చేసిన పాత్రలన్నింటికీ భిన్నంగా ఈ సినిమాలో సమంత పాత్ర ఉండబోతోందట.ఈ సినిమాలో ప్రేక్షకులను మేగ్జిమమ్‌ నవ్విస్తానంటోంది క్యూట్‌ క్యూట్‌ సమంత. త్వరలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలో కూడా నటించి తన సత్తా చూపిస్తానంటోంది. కన్నడంలో 'యూ టర్న్‌' అనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీకి సమంత కమిట్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళంలో కూడా విడుదల కానుందట. 

మరిన్ని సినిమా కబుర్లు
rashikhanna  likes looks chubby