Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rashikhanna  likes looks chubby

ఈ సంచికలో >> సినిమా >>

మెగా హీరోయిన్‌ వచ్చేస్తోంది

mega heroin was comming

మెగా ఫ్యామిలీ నుండి వస్తోన్న మొట్టమొదటి హీరోయిన్‌ నిహారిక. నాగబాబు తనయగా నటనలో తన టాలెంట్‌ని మెగా అభిమానులకు చూపించాలని తెగ ఉబలాటపడుతోంది. రామరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఒక మనసు' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది నిహారిక. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కబోతోంది.హీరోయిన్‌ అయినాక నిహారిక సెలక్టివ్‌గానే సినిమాలు చేస్తుందట. మెగా ఫ్యామిలీ ఇమేజ్‌కి ఏమాత్రం భంగం కలగనియ్యనంటోంది.

అంతే కాదు కొన్ని సినిమాల వరకే హీరోయిన్‌గా కొనసాగుతుందట ఈ కొణిదల వారమ్మాయ్‌. తరువాత చక్కగా పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిపోతుందట. పెళ్లి తరువాత సినిమాల జోలికి రానంటోంది. బుల్లితెరపై యాంకర్‌గా పని చేస్తూ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలైన నిహారిక త్వరలోనే వెండితెరపై కూడా మెరిసి సినీ ప్రేక్షకుల్ని మరింత ఖుషీ చేయనుంది. మెగా హీరోయిన్‌ నిహారిక వెండితెరపై తెరంగేట్రం ఎలా ఉంటుందా? అని మెగా అభిమానుల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. తనపై ఈ స్థాయిలో అంచనాలు పెరగడం పట్ల నిహారిక ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. తనపై తన కుటుంబం, అభిమానులు పెట్టుకున్న నమ్మకాల్ని వమ్ము చేయనంటోంది నాగబాబు తనయ. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam