Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
fans think

ఈ సంచికలో >> సినిమా >>

సంచలనాలకోసం 'ధృవ' వచ్చేస్తున్నాడు

druva is comming

రికార్డుల మగధీరుడు రామ్‌చరణ్‌ తేజ తన తాజా చిత్రం 'ధృవ'తో ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సినిమా హిట్టయినా, ఫ్లాపయినా రామ్‌చరణ్‌ నటించాడంటే, అది మినిమమ్‌ 40 కోట్లు వసూలు చేయాల్సింది. ఇది రామ్‌చరణ్‌కి మాత్రమే సాధ్యమైన రికార్డ్‌గా చెప్పవచ్చు. 'చిరుత', 'ఆరెంజ్‌' చిత్రాల్ని మినహాయిస్తే మిగతా అన్ని సినిమాలూ 40 కోట్ల పైబడి వసూలు చేసిన చిత్రాలే. ఈసారి 100 కోట్ల లక్ష్యంతో మెగా పవర్‌స్టార్‌ దసరా బరిలోకి దిగుతున్నాడు 'ధృవ' చిత్రంతో. తమిళంలో ఘనవిజయం సాధించిన 'తని ఒరువన్‌'కి 'ధృవ' తెలుగు రీమేక్‌. మాస్‌ చిత్రాలే అయినా క్లాస్‌ టచ్‌తో తెరకెక్కించడం సురేందర్‌రెడ్డి స్పెషాలిటీ. ఆయన చిత్రాల్లో డిఫరెంట్‌ టోన్‌ ఉంటుంది. చాలా స్టయిలిష్‌గా ఉంటాయి సురేందర్‌రెడ్డి చిత్రాలు. సో, చరణ్‌ - సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో రాబోయే 'ధృవ' టాలీవుడ్‌ గత రికార్డుల్ని తిరగరాయడం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో 'ధృవ' చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర నిర్మాత అల్లు అరవింద్‌ ప్లాన్‌ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్‌లో 'మగధీర' తర్వాత చరణ్‌ చేస్తున్న చిత్రమిదే. 'మగధీర' అప్పట్లో తెలుగు సినిమా రికార్డుల్ని తిరగరాసింది. అప్పటికీ ఇప్పటికీ అదో మాస్టర్‌ పీస్‌గా నిలిచింది. ఆ కోణంలో చూసినా, 'ధృవ' తెలుగు సినిమా పరిశ్రమలోనే ఓ స్పెషల్‌ ఫిలింగా ఉండబోతోందని అనుకోవచ్చు. 'ధృవ'లో చరణ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కి అపోనెంట్‌గా 'రోజా' ఫేం అరవింద్‌స్వామి నటిస్తున్నాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
mahesh speed increase