Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
what will be kings second room

ఈ సంచికలో >> సినిమా >>

చందమామతో 'మెగా' చిందులు

kajal act chiru movie

మెగాస్టార్‌ చిరంజీవి మళ్ళీ మళ్ళీ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మామూలుగా బయట చూస్తేనేమో కొంచెం బొద్దుగా కనిపిస్తున్నారు. సెట్స్‌లోకి వెళ్ళాక మాత్రం యంగ్‌ లుక్‌తో, స్లిమ్‌గా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నారు. ఏంటీ సినీ మాయ? అని ఆశ్చర్యపోతున్నారట 'ఖైదీ నెంబర్‌ 150' సెట్స్‌లో చిరంజీవిని చూసినవారంతా. అలా ఆశ్చర్యపోతున్నవారిలో చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఉండటమే విశేషమిక్కడ. ఏమో, ఈ మెగా మాయ ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. చిరంజీవి కొత్త సినిమాకి 'ఖైదీ నెంబర్‌ 150' టైటిల్‌ని చిత్ర నిర్మాత రామ్‌చరణ్‌ ఇప్పటికే ధృవీకరించారు. టైటిల్‌తో కూడిన లుక్‌ని కూడా విడుదల చేశారు.

ఇంకో వైపున, ఈ చిత్ర షూటంగ్‌లో అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ కూడా పాల్గొంటోంది. కాజల్‌ సరసన చిరంజీవి ఎలా ఉంటారో? అని సందేహపడినవారికి ఆ సందేహాలు పటాపంచలయ్యే గ్లామరస్‌ లుక్‌తో చిరంజీవి అదరగొట్టేశారు. షూటింగ్‌ స్పాట్‌ నుంచి లీకైన స్టిల్స్‌లో చిరంజీవిని చూసి షాక్‌కి గురయ్యారంతా. రామ్‌చరణ్‌తో నాలుగు సినిమాలకు పనిచేసింది కాజల్‌ అగర్వాల్‌. ఇందులో చరణ్‌ సరసన 'మగధీర', 'నాయక్‌', 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాల్లో కాజల్‌ హీరోయిన్‌గా నటించింది. చరణ్‌ హీరోగా వచ్చిన 'ఎవడు' సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది, అల్లు అర్జున్‌కి జోడీగా. అలా కాజల్‌తో చరణ్‌కి మంచి హిట్స్‌ ఉన్నాయి. అదే సెంటిమెంట్‌తో రామ్‌చరణ్‌ తొలిసారి నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం కోసం కాజల్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడేమో. ఏదేమైనా అందాల చందమామతో మెగాస్టార్‌ చిందులు అంచనాలకే అందవ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
picchigaa nacchav movie so curiosity