Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with sumanth

ఈ సంచికలో >> సినిమా >>

కాటమరాయుడి సెట్‌లో మెగాస్టార్‌

megastar in katamarayudi shooting set

పవన్‌ కళ్యాణ్‌ సినిమా 'కాటమరాయుడు' సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ సెట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ని కలిశారు. ఇదే సెట్‌లో చిరంజీవి ఖైదీ నెం 150 షూటింగ్‌ కూడా జరగుతుండడం విశేషం. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ కలిసి కాస్సేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఫ్యామిలీ విషయాలు కాకుండా, సినిమాకి సంబంధించిన విషయాలు చర్చించుకున్నారు.

గతంలో పవన్‌ కళ్యాణ్‌ 'గుడుంబా శంకర్‌' సినిమా షూటింగ్‌, చిరంజీవి 'శంకర్‌దాదా ఎమ్‌బిబియస్‌' సినిమా షూటింగ్‌లు పక్కపక్కనే జరిగాయి. అదే సందర్భంలో పవన్‌ కళ్యాణ్‌ గుడుంబా శంకర్‌ గెటప్‌లోనే చిరంజీవి సినిమాలో ఒక చిన్న సీన్‌లో కనిపిస్తాడు. అదీ ఒక పాటలో శ్రీకాంత్‌కి మందు పోసే సీన్‌లో పవన్‌కల్యాణ్‌ మెరుస్తాడు. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది అప్పట్లో. ఇప్పుడు కూడా 'ఖైదీ నెం 150'లో పవన్‌ కనిపించనున్నారనే వార్త బాగా వినిపిస్తోంది. ఆ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయితే 'ఖైదీ నెం 150' బ్లాక్‌ బస్టర్‌ కావడం ఖాయం. చిరు రీ ఎంట్రీలో వినాయక్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమాలో ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌తో చిరు రొమాన్స్‌ చేయనున్నాడు. రాంచరణ్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
druva is tention