Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
karthi in negetive roal with surya

ఈ సంచికలో >> సినిమా >>

వెంకీ 'గురు' - పంతం నీదా? నాదా?

venkatesh  nex movie ready

విక్టరీ వెంకటేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'గురు' సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సర్వ హంగులూ సొంతం చేసుకుంటోంది. హిందీలో వచ్చిన 'సాలా ఖదూస్‌' సినిమాకి ఇది తెలుగు రీమేక్‌. ఇందులో వెంకటేష్‌ బాక్సింగ్‌ ట్రైనర్‌గా నటిస్తుండగా, బాక్సింగ్‌ కాంపిటేషన్స్‌కి ప్రిపేర్‌ అయ్యే యువతిలా రితిక నటిస్తోంది. హిందీ వెర్షన్‌తో పోల్చితే తెలుగు వెర్షన్‌ కోసం చాలా మార్పులు చేశారట. ఆ మార్పులు సినిమా రేంజ్‌ని పెంచేలా ఉంటాయని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం వెంకటేష్‌ బాగా వెయిట్‌ పెరిగాడు. కండలు తిరిగే దేహాన్నీ సొంతం చేసుకున్నాడు. వెరైటీ గెటప్‌తో ఇప్పటికే సినిమా స్టిల్స్‌లో వెంకీ సందడి చేస్తున్నాడు. ఆ లుక్‌ చూసి అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతుండడం కూడా జరుగుతోంది. ఇలాంటి పాత్రలు చేయాలంటే అది పెద్ద సాహసమే. దానికి కారణం కూడా లేకపోలేదు. కమర్షియల్‌ సినిమా ఫార్మాట్‌లో హీరో చుట్టూనే కథ తిరగాలి. గ్లామర్‌, ఫైట్స్‌, కామెడీ వంటి అంశాలు తప్పదు. కానీ ఎప్పుడూ అవే తరహా సినిమాలంటే బోర్‌ కొట్టేస్తాయి కదా. అందుకే వెంకీ కొత్తగా ఆలోచించినట్లున్నాడు. హిందీలో హ్యాండ్సమ్‌ హీరో మాధవన్‌ కూడా అలాగే ఆలోచించాడు. ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. కథ మొత్తం రితిక పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆమెకు శిక్షణ ఇచ్చే 'గురు' పాత్ర అత్యంత కీలకం. అందుకే ఇద్దరూ నువ్వా? నేనా? అనేలా నటించాల్సి వచ్చిందట. 

మరిన్ని సినిమా కబుర్లు
akhil engagement date fix