Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mosambi battaayi

ఈ సంచికలో >> శీర్షికలు >>

తొమ్మిది రకాల క్యాన్సర్లు - వాటిని తెలియజేసే ముందస్తు లక్షణాలు - అంబడిపూడి శ్యాం సుందర రావు

9 types of cancer diseases

ఏ రకమైన వ్యాధికైనా ముందుగా కనిపించే లక్షణాలను గుర్తించి ప్రారంభ దశలోనే చికిత్స మొదలు పెడితే ఆ వ్యాధి ప్రాణాంతకం అవదు అందువల్ల వ్యాధిని వాటి లక్షణాలను బట్టి ప్రాధమిక దశలో గుర్తించటము చాలా అవసరము దానికి ముందు మనము ఆ వ్యాధికి కి ప్రారంభ దశలో కనిపించే లక్షణాలను తెలుసుకోవాలి.ప్రస్తుతము ఎక్కువ మందిని బాధపెట్టి నయముకాని జబ్బుగా పేరుతెచ్చుకున్న జబ్బు క్యాన్సర్ ఈ క్యాన్సర్ కు వ్యతిరేకముగా జరిపే యుద్దములో ప్రతివారు క్యాన్సర్ ముందస్తు లక్షణాలను తెలుసుకోవాలి ఈ లక్షణాలు మిగతా జబ్బులలో కూడా కనిపిస్తాయి కాబట్టిలక్షణాలను గమనిస్తే డాక్టరును సంప్రదించి ప్రారంభ దశలోనే చికిత్స మొద;యూ పెడితే ఆ వ్యాధి ప్రాణాంతకం అవదు ఈవ్యాసములో తొమ్మిది రకాల క్యాన్సర్లను గుర్తించే లక్షణాలను వివరించటము జరిగింది దీనివల్ల ఎవరికయినా లేదా మన దగ్గరివారిలోనైనా ఈలక్షణాలను గమనిస్తే వెంటనే డాక్టరును సంప్రదించి  చికిత్స ప్రారంభించి రోగాన్నించి విముక్తి పొందవచ్చు

1. కొలోన్(పెద్ద ప్రేగు) క్యాన్సర్:- పాశ్చత్య దేశాలలో అతి ప్రమాదకారిగా పేరుపొందినది ఇదే ఈ వ్యాధిలో పెద్దప్రేగులేదా పెద్దప్రేగు చివరిభాగము
అయినా పురీషనాళము లోపలి భాగములో పెరుగుదల ఉంటుంది ప్రారంభ దశలో దీనిని  గుర్తిస్తే ఇది అంత  ప్రమాదకారి కాదు వైద్యము వల్ల ఫలితము కనిపిస్తుంది. మంచి పీచు అధికముగాకలిగిన ఆహారాన్ని తీసుకుంటూ ఆల్కాహాల్ ను, ప్రాసెస్ చేయబడిన మాంసమును తీసుకోకుండా ఉంటె ఈ రకమైన క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఈ క్యాన్సర్ ను గుర్తించటానికి మొదటి లక్షణము మలముతో పాటు
రక్తము రావటము.ఈ లక్షణము ఇతర జీర్ణ సంబంధమైన వ్యాధుల కూడా కనిపిస్తుంది. కానీ కొలోన్ క్యాన్సర్ ను గుర్తించటానికి ఇది మొదటి లక్షణము కాబట్టి మలముతో పాటు రక్త స్రావము ఉన్నా ,మలము నలుపు రంగులో ఉన్నా ఏ మాత్రము అశ్రద్ధ చేయకుండా డాక్టరు ను సంప్రదించాలి. రెండవ లక్షణము జీర్ణ వ్యవస్థలో ఆహారము కదలిక సక్రమముగా ఉండదు అంటే ఆహారము సాధారణము కన్నా వేగముగా లేదా నెమ్మదిగా ఉంటుంది. ఫలితముగా దీర్ఘకాలికడయోరియా లేదా మలబద్దకం ఏర్పడవచ్చు.      కాబట్టి  పాటు  ఆహారము కదలికలు సక్రమముగా లేనట్లు అనిపిస్తే అశ్రద్ధ చేయకుండా డాక్టరును సంప్రదించాలి. ఇంకా ఇతర లక్షణాలు, తీవ్రమైయినా కడుపు నొప్పి, జీర్ణాశయములో  గడ్డలు  ఏర్పడటం, కారణము లేకుండా బరువు తగ్గటం వంటివి.

2. ఒవేరియన్ (అండాశయ) క్యాన్సర్ :-సాధారణముగా 50 ఏళ్ళు దాటినా ఆడవారిలో అండాశయములోని కణజాలంలో ఈ రకము క్యాన్సర్ కనిపిస్తుంది చాలా అరుదుగా యువతులలో కూడా కనిపించవచ్చు. దీనికి కారణాలు ఖచ్చితముగా తెలియవు .  జన్యు పరమయిన.సంతాన సాఫల్య వైద్యాలు. లేదా ప్రెగ్నెన్సీని వాయిదా వేయటం వంటివి ఈ వ్యాధికి కారణాలు. ఈ వ్యాధిలో కనిపించే లక్షణాలు కడుపు ఉబ్బరం,మలబద్దకం,డయోరియా,గ్యాస్ సమస్య,వాంతి వచ్చే టట్లు ఉండటము మొదలైనవి. ఈ లక్షణాలన్నీ జీర్ణ వ్యవస్థకు సంబంధిచినవి కావటంతో చాలా మంది అశ్రద్ధ చేస్తారు.  అందువల్ల ఈ లక్షణాలను గమనించినప్పుడు ఒవేరియన్ క్యాన్సర్ అవునో కాదో తెలుసుకోవాలి . ఇతర లక్షణాలు ఆకలి మందగించటం, కొద్దిగా తిన్న కడుపు నిండినట్లు ఉండటము, తరచుగా మూత్ర విసర్జన,కటి ప్రాంతము,వీపు దిగువ భాగము లో నొప్పి,మెనోపాజ్ దశలో విపరీతమైన రక్తస్రావము మందకొడి తనముగా ఉండటము మొదలైనవి

3. స్కిన్ (చర్మ)క్యాన్సర్:-  ఈ స్కిన్ క్యాన్సర్ ముందు చర్మము ఉపరితలాన ప్రభావము చూపి క్రమముగా ఇతర భాగాలకు ప్రాకుతుంది. దీనికి ముఖ్య కారణము  సూర్య రశ్మినుండి సరి అయినా రక్షణ లేకపోవటమే రంగు బాగా ఉండేవారికి ఈవ్యాధి వచ్చే అవకాశము ఎక్కువ..పుట్టుమచ్చల అకారము,సైజు,రంగులలో త్వరగా కలిగే  మార్పు స్కిన్ క్యాన్సర్  కు  సూచన వంటిది. చర్మముపై ఏర్పడే ఎర్రటి మచ్చలు కూడా క్యాన్సర్  కు  కారణము కావచ్చుకాబట్టి ఇటువంటి లక్షణాలను గమనిస్తే  ముందుగానే గుర్తించి  చికిత్స ప్రారంభిస్తే
ప్రాణాలను కాపాడుకోవచ్చు.సాధారణముగా చర్మముపై ఏర్పడే పుండ్లు త్వరగానే తగ్గిపోతాయి కానీ అవి చాలా కాలము దాకా తగ్గకపోతే అది క్యాన్సర్ కారకము అవ్వచ్చు. చర్మముపై ఇంతకు ముందు కనిపించని మచ్చలు ,వాటి రంగు మార్చు ఉంటె అది కూడా క్యాన్సర్ లక్షణమే .

4.బ్రెస్ట్ (స్తనాల )క్యాన్సర్): -ముందు ప్రారంభ దశలో ఆడవారి స్థానాలలో నొప్పి లేని గడ్డలుగా మొదలవుతుంది.క్రమముగా లోపలి భాగాలకు వ్యాప్తి చెందుతుంది.ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ను ప్రారంభ దశలో  గుర్తిస్తే ప్రాణాపాయము ఉండదు. 50 ఏళ్ళు దాటినా ఆడవారిలో ఇది చాలా సాధారణముగా కనిపించే జబ్బు మగవారిలో ఇది కనిపించటం చాలా అరుదైన సంగతి ఈ గడ్డలు లేదా వాపులు (ఎండిమా) కొన్ని సందర్భాలలో నొప్పిని కలుగజేయవచ్చు. ఏదై నప్పటికీ ఇటువంటివి కనిపించినప్పుడు డాక్టరును సంప్రదించాలి. చనుమొనలలో కూడా ఈ
వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి చనుమొనల  మారటం,చర్మము బిరుసుగా ఉండటము లేదా చనుమొనలలో వాపు కనిపించటము కొని స్రావాలు కనిపించటము సాధారణముగా కనిపించే లక్షణాలు ఇవే కాకుండా స్తనాల లో  లేదా చంకలలో దీర్ఘకాలిక నొప్పి లేదా రక్తనాళాల వాపు , కాలర్ ఎముక నొప్పి వంటి లక్షణాలు ఈ వ్యాధిని గుర్తించడానికి ఉపయోగిస్తాయి.

5. ఊపిరితిత్తుల(లంగ్)  క్యాన్సర్  :-ఇది చాలా ప్రమాదకరమైనది ప్రాణాంతకమైనది  అడ మగ తేడా లేకుండా ఎవరికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశము  ఉంది దీనికి ముఖ్య కారణము పొగాకు పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లవంటివి ఊపిరి సరిగా అందకపోవట ము ముఖ్యముగా పడుకున్నప్పుడు అనిపిస్తే అది ఈ రోగము  అవచ్చు దీర్ఘ కాలిక తగ్గని దగ్గు దగ్గుతో పాటు రక్తము రావటము ఈ వ్యాధి లక్షణాలు కాబట్టి రెండు మూడు వారాల దాకా తగ్గని దగ్గు,రక్తము పడుతూ  ఉంటె ఇదిఈ వ్యాధికి  ఒక హెచ్చరిక లాంటిది అప్పుడు తప్పనిసరిగా
డాక్టరును సంప్రదించాలి ఛాతీలో గాలి పీలుస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి,మెడ లో లింఫ్ నోడ్స్ ఉన్న ప్రాంతములో వాపు , మ్రింగటములో ఇబ్బంది మొదలైన లక్షణాలు కూడా ఈ వ్యాధికి ముందస్తు హెచ్చరికలు లాంటివి కాబట్టి ఈ లక్షణాలను గమనిస్తే వెంటనే డాక్టరును సంప్రదించలి.

6.జీర్ణాశ (స్టమక్ )క్యాన్సర్ :- జీర్ణాశపు లోపలి భాగములో పెరుగుదల కనిపించి క్రమముగా లింఫ్ నోడ్స్ ఇతర భాగాలకు అంటే జీర్ణాశయానికి దగ్గరగా ఉండే అవయవాలకు వ్యాపించటము ఈ వ్యాధి లక్షణము. ఈ వ్యాధికి కారణాలు ఇంకా పూర్తిగా  తెలియాల్సి ఉంది నిపుణుల ఉద్దేశ్యము ప్రకారము ఆహారములో ఉపయోగించే ప్రిజర్వేటివ్ పదార్ధాలు కొంత కారణము . సాధారణముగా 65 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో ఇది కనిస్పిస్తుంది ఈ వ్యాధి వచ్చిన వారు శరీరము బరువులో అనుకోని మార్పులు అంటే తగ్గటం జరుగుతుంది ఇది ఈ వ్యాధిని  గుర్తించటానికి ముఖ్య లక్షణము ఇది జీర్ణాశయములో దీర్ఘకాలిక అజీర్ణాన్ని సూచిస్తుంది. ఈ అజీర్ణము కారణము ఏదైనా కావచ్చు కానీ జీర్ణాశయపు క్యాన్సర్ లో విపరీతమైన నొప్పి ఉంటుంది అటువంటి పరిస్తుతులలో తప్పని సరిగా డాక్టరు ను సంప్రదించాలి మలము తో పాటు రక్తస్రావము , మలము నల్లగా రావటము ఆకలి పూర్తిగా మందగించటం ఈ వ్యాధిని గుర్తించే ఇతర లక్షణాలు.

7.నోటి ( మౌత్)క్యాన్సర్:- నోటిలో పెదాలపై చిగుళ్లపై ,అదేదేవిధముగా లాలాజల గ్రంధులలో,పెరుగుదల కనిపించటము ఈ వ్యాధి లక్షణాలు.దీనివల్ల లింఫ్ వ్యవస్థ దెబ్బతింటుంది ఎలా,ఊపిరితిత్తులు కూడా దీని ప్రభావానికి లోనవుతాయి, ఎక్కువగా 40 సంవత్సరాల వయస్సు పై బడిన మగవారిలో ఈవ్యాధి కనిపిస్తుంది. పొగత్రాగటం మానేస్తే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా మటుకు తగ్గుతాయి. నోటిలో వరకు తగ్గకపోతే నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎర్రటి లేదా తెల్లటి మచ్చలు నోటిలో కనిపించటము , నోటిలో వివరించలేని
విధముగా నొప్పి,లేదా నోటిలో గుద్దులాగా ఏర్పడిగొంతు నొప్పి మొదలవటము,గొంతు బొంగురు గొంతుగా మారటము ,ఆహారము మ్రింగతములో ఇబ్బంది పడటం వంటివికూడా ఈ వ్యాధిని గుర్తించే లక్షణాలు. ఈ మధ్య పొగత్రాగటమే కాకుండా జర్దా కిళ్ళీలు నమలటం కూడా ఈ క్యాన్సర్ కు కారణం ఆవుతుంది .

8. త్రోట్(గొంతు)క్యాన్సర్ :-  స్వర తంతుల పైన గొంతు లోపలిభాగాలలో కనిపించే పెరుగుదలలు ఈ వ్యాధి ప్రాధమిక లక్షణాలు ఈ పెరుగుదలలు గొంతు నుండి అన్నవాహిక, లింఫ్ నోడ్ లకు వ్యాపిస్తుంది. సిగరెట్లు,మధ్య పానము వవతి అలవాట్లు ఈ వ్యాధిని త్వరగా అభివృద్ధి చేస్తాయి. గొంతులో గడ్డలు, లేదా వాపులు మూడు వారాలైనా తగ్గకుండా ఉంటె గొంతు క్యాన్సర్ కు సూచన .ఈ వాపు
లేదా గడ్డలు నొప్పిఉండవచ్చు లేకపోవచ్చు నొప్పి లేదు కదా నాయి అశ్రద్ధ  చేయకుండా డాక్టరును సంప్రదించాలి. అన్నవాహికలో ఏర్పడ్డ గడ్డలు లేదా వాపు ఆహారాన్ని మ్రింగనివ్వదు. మ్రింగేటప్పుడు నొప్పిగా ఉంటుంది. గొంతు బొంగురుగా మారటం, ఎక్కువగా వాంతులు అవటము ,దీర్ఘకాలిక దగ్గు, కొన్ని సందర్భాలలో  దగ్గినప్పుడు నెత్తురు రావటము,శరీరము బరువు తగ్గటం  వంటివి ఈ
వ్యాధిలో కనిపించే ఇతర లక్షణాలు ఈ లక్షణాలను గమనించినప్పుడు అశ్రద్ధ చేయకుండా డాక్టరును సంప్రదించాలి.

9. ప్రోస్టేట్ (పౌరుష గ్రంధి)  క్యాన్సర్ :- సాధారణముగా 60సంవత్సరాల  వయస్సు పైబడిన మగవారిలో కనిపించే క్యాన్సర్ .  ఇది నిజానికి ప్రోస్టేట్ గ్రంథిలో కనిపించే మ్యాలిగినంట్ ట్యూమర్  ప్రోస్టేట్ గ్రంధి అనేది పురుష ప్రత్యుత్పత్తిలో ఒక అనుబంధ గ్రంధి ఇది మూత్రాశయానికి దగ్గరలో ఉంటుంది. ఈ వ్యాధిలో ఎదురయే ప్రధాన సమస్య మూత్ర విసర్జనలో ఇబ్బంది. అంటే చాలా తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళవలసి రావటము ,మూత్రాన్ని ఆపుకోలేకపోవటము వంటి ఇబ్బందులు వస్తాయి. ఇది సామాన్యముగా వయస్సు వల్ల వచ్చే ఇబ్బందిగా భావించి
చాలా మంది అశ్రద్ధ చేస్తారు. మూత్రములో రక్తము రావటము,మూత్ర విసర్జన అప్పుడు మంటగా ఉండటము పౌరుష గ్రంధి స్రావము సెమెన్ ద్వారా రక్తము రావటము వంటివి కూడా ఈ వ్యాధిలో కనిపించే ఇతర లక్షణాలు కాబట్టి ఈవయస్సు వారికైనా ఏరకమైన క్యాన్సర్ వ్యాధి అయినా వచ్చే అవకాశాలు ప్రస్తుతము ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ సంబంధిత క్యాన్సర్ లక్షణాలను గమనిస్తే ప్రారంభ దశలోనే డాక్టరును సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ ప్రాణాంతకం అవదు. 
 

మరిన్ని శీర్షికలు
Depression, Causes and Ayurvedic Treatment in Telugu |