Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri question

ఈ సంచికలో >> శీర్షికలు >>

సత్యసాయి భోధనలు - అన్నిదానాల్లోకీ అన్నదానం మంచిది - ఆదూరి హైమావతి

satya sai baba information

 పక్క నున్నవాని డొక్క మాడుచు నుండ
నిక్కి పొట్ట నిండ మెక్కువాడు
నిశ్చయముగ కాడు నిజమైన మనుజుడు
ఉన్నమాట తెలుపుచున్న మాట.    -- బాబా .

Help Ever -  Hurt Never. Love All – Serve All-- అనేవి శ్రీ సత్యసాయి బాబావారి ప్రధాన సూక్తులు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ఆర్త త్రాణపరాయణులు.ఆయనను ఒక్కమారు చూసి తలంచుకుంటే చాలు,' సాయీ !' అనిపిలువగానే ' ఓయీ' అని సమాధానం వస్తుంది. కష్టంలో ఉన్నవారిని ఆదుకుంటారు. భోజనానికి గడవని వారికి ఏదో ఒకమార్గం చూపుతారు .

ఎరిగుంటిమా మనము ఎప్పుడైనా మునుపు
               స్వార్ధ రహితమైన సాయి ప్రేమ!
    కనియుంటిమా మనము కరుణార్ధ హృదయమ్ము  
              సాయి యందుతప్ప సంఘమందు
    వినియుంటిమా మనము వీనుల విందైన
               మనస్వామి జరిపించు మధురభజన
    తలచుంటిమా మనము  కలలోన ఎపుడైన
              సాయి సన్నిధిలోని సౌఖ్యశాంతి
    పుట్టి ఎరుగము ఇటువంటి పుణ్యమూర్తి  
     చూచి ఎరుగము శ్రీ సత్య సాయి కీర్తి
    చదివి ఎరుగము మనసాయి లాంటి వ్యక్తి
     తెలిసి ఎరుగము దేదీప్య దైవ శక్తి.
‘ Why fear whenI am here ‘ ---  అంటారు బాబావారు. ..............

ఆకలైన వారికి అన్నం -- అది పెద వెంకమ రాజు గారి ఇల్లు. మధ్యాహ్నం ఒంటిగంట . అంతా భోజనాలకు కూర్చు న్నారు. ఇంటినిండా కొడుకులూ, కోడళ్ళూ, వారిపిల్లలు  , దిగువ మధ్యతరగతి కుటుంబం.అందరికీ ఇంటి ఇల్లాలు ఈశ్చరమ్మ  భోజనం పళ్ళాల్లో రాగి సంకటి ముద్ద, వేరుశనగ పచ్చడి  , ఆకుకూరపప్పు వడ్డిం చారు. అంతావచ్చి ఎవరి కంచాల వద్ద వారు కూర్చున్నారు.ఇంతలో ఇంటి ముందు నుంచీ చిన్న  పిల్లవాని గొంతువినిపించింది. " అమ్మా! ఆకలి, నిన్నటినుండీ అన్నంలేదు, ఆకలితల్లీ! ఇంతముద్దపెట్టండమ్మా!" అని వినిపించింది . అంతా భోజనానికి ముందు కళ్ళు మూసుకుని ప్రార్ధన చేయడంలో మునిగి ఉన్నారు. ఈశ్వర మ్మ వంటశాలలో గిన్నెలు చక్కబెడు తోంది. ఆరేళ్ళ సత్యనారాయణరాజు తన భోజనం పళ్ళెంతో లేచివెళ్ళి ఇంటిముందు అన్నానికై అరిచి , వేచి ఉన్న చిన్న బాలునికి తన కంచంలోని భోజన మంతా పెట్టి , నవ్వుతూ " కడుపునిండాతిను " అనిచెప్పి , తిరిగి వెనక్కు వచ్చాడు .

భోజనాల వద్ద ఉన్న వారంతాకోపంగా సత్యాన్ని చూశారు. వాళ్ళనాన్నపట్టరాని క్రోధంతో " ఏరా ! రాజూ !నీభోజన మంతా దానం చేశావే ? నీకెవరు మరలా పెడతారు? ఇలా దాన ధర్మాలు చేయను మన మేమన్నా ధనికుల మనుకున్నావా? నీ భోజనం దానం చేశా వుగనుక నీకీ పూట భోజనం లేదు వెళ్ళు " అన్నారు కోపంతో .సత్య నారాయణ రాజు నవ్వుతూ ," సరే. ఈ పూటనేను భోజనం చేయను. " అనివెళ్ళి కిటికీ వద్ద చేరి ,ఇందాక తాను అన్నంపెట్టిన బాలుడు కిటికీ ముందు కూర్చుని అన్నం తింటుండటాన్ని చూస్తూ నిల్చున్నాడు.ఇంతలో వాళ్ళ అమ్మ ఈశ్వరమ్మ వచ్చి , " రా రాజూ ! వచ్చి భోజనంచేయి, అంతా నీకోసం ఎదురుచూస్తున్నారు." అని పిలిచింది.సత్యనారాయణరాజు నవ్వుతూ " లేదమ్మా ! నా ఆకలి తీరిపోయింది. నేనీపూట ఇహ భోజనం చేయను." అని స్థిరంగాచెప్పాడు. తండ్రి, తాత , అన్నలు ఎందరు పిలిచినా ఆపూట ఆబాలుడు  భోజనంచేయనేలేదు ."ఎవరైనా సరే ఆకలితో ఉంటే నేనుచూడ లేను ,ఆచిన్న పిల్ల వాడు ఆకలితో ఉంటే నేనెలా భోజనం చేయగలను? " అనిచెప్పి లోనికి వెళ్ళాడు. ఆనాటి ఆ చిన్నబాలుడు సత్యనారాయణ రాజే  ఆతర్వాత  సత్య సాయిబాబావారై ఎందరో అన్నార్తు లకు, బిక్షగాళ్ళ కు కడుపునిండాభోజనం పెట్టించారు.

అన్నిదానాల్లోకీ అన్నదానం గొప్పదని పసి వయస్సు లోనే చేసి చూపిన బాబావారు ఆతర్వాత తన సత్యసాయి సేవాసంస్థలద్వారా విరివిగా అన్నదానం చేయిం చారు,  ఇప్పటికీ ఆ అన్నదాన కార్యక్రమం 'నారాయన  సేవ.' అనే పేరుతో కొనసాగుతూనే ఉంది. అమెరికావంటి పాశ్చాత్య దేశాల్లో సైతం ,ఈనాటీకీ 'హోం లెస్ వారికి , 'డిన్నర్ సర్వీస్, బ్రేక్ ఫాస్త్ సర్వీస్ ' అనే పేరుతో కొనసాగుతూ నే ఉంది [ ఈ వ్యాస రచయిత సైతం ఆకార్యక్రమాల్లో చికాగోలో పాల్గొనడం జరిగింది. ]  . పసితనం నుండే మానవ సేవచేస్తూ ,ఆర్తులను ఆదుకుంటూ  విశ్వంలోని  మానవులకంతా  ఆదర్శమూర్తిగా నిలి చి, ఇలా తన భక్తులద్వారా నేటికీ అన్నదాన కార్యక్రమాలను ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. 

చొక్కాదానం - పువ్వు పుట్టగానే పరిమ ళిస్తుంది  ' అనే మాట వాస్తవం చేస్తూ ఆబాలుడు పసితనంలోనే తన త్యాగ గుణాన్ని చూపాడు.
సత్యనారాయణరాజు ఇంట్లో చాలామంది ఉండేవారు. వారిది మధ్యతరగతి ఉమ్మడి కుటుంబం . ఆదాయమూ తక్కువే! ఉన్నకొద్దిపాటి మెట్ట పొలం పండితేనే భుక్తి. ఇహ మిగిలిన సదుపాయాలూ దానికి తగ్గట్లే ఉండేవి. పండుగకు కొత్త బట్టలు అనేది ఆ ఇంటిపిల్లలకు తెలీదు.వారితాత కొండమ రాజు యాడాదికో మారు బట్టలు కొనేవారు సంవత్సరమంతా వాటినే జాగ్రత్తగా వాడుకోవాలి. తలా రెండు జతలు కుట్టించే వారు. పిల్లలంతా  బడి కి  ఆరెండు జతలనే మార్చి మర్చి జాగ్రత్తగా వాడుకుంటూ వేసుకునేవారు.ఓయాడాది కొండమరాజు బట్టలు తెచ్చి ఎవరికి  కావలసినవి వారిని ఎంచుకోమన్నారు. పిల్లలంతా హుషారుగా బిలబిలావెళ్ళి  వారికి కావలసి నవి వారు ఎంపిక చేసేసు కున్నారు. కానీ సత్యనారాయణరాజు మాత్రం కదల్లేదు . తాత " ఏం సత్యం! నీవు ఎంపిక చేసుకోవా?" అని అడగ్గా " అంతా తీసుకున్నాక మిగిలినవే నాకివ్వండి, నాకేవైనా ఫరావా లేదు." అని చెప్పాడు. తాత ప్రేమతో " శభాష్ రాజూ ! నిన్ను చూసి అంతా తృప్తి అనేది నేర్చు కోవాలి." అని మెచ్చుకున్నా రు.  దర్జీనుండీ  బట్టలు కుట్టించి తెచ్చాక ఎవరివి వారికి ఇచ్చారు కొండమరాజు. అంతావారి వారి బట్టలు తీసుకు వెళ్ళారు దాచుకోను. సత్యనారాయణరాజూ తన రెండుచొక్కాలూ , నిక్కర్లూ తీసుకుని వెళ్ళాడు.

మరిన్ని శీర్షికలు
chamatkaaram