Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
paryatakam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అచారం - నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు

achaaram

దేవాలయంను దర్శించుకునే పద్దతి

దేవాలయం అంటే దైవం నెల వున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువై ఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను, పద్ధతులను పాఠించాలి. అప్పుడే మనం ఆ దైవము యొక్క అనుగ్రహమునకు పాత్రులం అవుతాము.

* ప్రతి భక్తుడు ( స్త్రీ/పురుషులు ) ఆలయమునకు వెళ్ళేముందు శుచిగా స్నానం చేసి, నుదుట కుంకుమ బొట్టు ధరించాలి.

* సాంప్రదాయమైన వస్త్రములు ధరించాలి.స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి.

* కనీస పూజా సామాగ్రిని తీసుకుని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరకు, మహాత్ముల దగ్గరకు, దేవాలయమునకు వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్ళరాదు. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ " పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అనగా ఎవరైతే నాకు భక్తితో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని సమర్పిస్తారో వాతిని ప్రేమతో స్వీకరిస్తాను" అని చెప్పాడు.

* ఆలయంనకు వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుగుకోవాలి.

* ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా గోపురానికి, మెట్లకు నమస్కరించాలి.

* లోనికి ప్రవేశించినప్పటి నుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమనస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవునిపై ఉంచాలి.

* ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే ముందుగా ధ్వజస్తంభం దర్శించుకోవాలి.

* దైవనామం జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ  ఐదు ప్రదక్షిణాలు చేసి పురుషులు కుడివైపు, మహిళలు ఎడమ వైపు నిల్చోవాలి.

* ప్రదక్షిణాలు చేయునపుడు వేగంగా చేయరాదు.

* టోపీలు, తలకు వస్త్రం కట్టుకోవద్దు.

* అనవసరంగా మాట్లాడటం, పరుషపదజాలం ఉపయోగించకూడదు.

* ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, నోట్లో ఎదైనా నముల్తూ దర్శనం చేయకూడదు.

* నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో నడువరాదు.

* ఒక చేత్తో దర్శనం చేయకూడదు.

* ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయరాదు.

* మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి  అందులో లీనం కావాలి. తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.

* అర్చన చేసుకునేవారు తమ గోత్రనామాలతో పూజ చేయించుకోవాలి.

* తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గోకర్నాకృతిలో ఉంచి చేయి క్రింద ఐదైనా వస్త్రం ఉంచుకుని భక్తితో మూడు సార్లు తీర్థం తీసుకోవాలి.

* దర్శనం తదుపరి కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.

* మీరు తీసుకువెళ్ళిన ప్రసాదం నలుగురికి పంచి మీరు స్వీకరించాలి.

* వచ్చేటపుడు  వెనుకవైపు కాస్త దూరం నడిచి తర్వాత తిరిగిరావాలి.

* దేవాలయం నుండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుగుకోరాదు.

" అన్నింటికన్నా భక్తి లేకుండా ఎన్ని చేసినా వ్యర్థం. కావున భక్తి ప్రధానం"

మరిన్ని శీర్షికలు
story review