Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
AP cinema nandi awards

ఈ సంచికలో >> సినిమా >>

రామ్‌గోపాల్‌ వర్మ ఈజ్‌ బ్యాక్‌

varma is back

రామ్‌ గోపాల్‌ వర్మ డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రం 'సర్కార్‌-3'. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యింది. చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సెన్సేషనల్‌ హిట్‌ అందుకున్నాయి. ఈ సారి రాబోతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. వర్మ టేకింగ్‌, వర్మ సినిమాల్లో ఉండే అద్భుతమైన సినిమాటోగ్రఫీ, దానికి తగ్గట్టుగా ఉండే సంగీతం అన్నీ కలిసొచ్చాయి ఈ సినిమాకి. వర్మ నుంచి ఇలాంటి కంటెంట్‌నే ఆయన అభిమానులు ఆశిస్తున్నది. ఈ మధ్య ఆయన టాలెంట్‌కి తగ్గ సినిమాలు రావట్లేదని ఆందోళన చెందుతున్నారు వర్మ అభిమానులు.

ఆయన అభిమానులకు ఈ తాజా ట్రైలర్‌ ఫుల్‌ మీల్స్‌ పెట్టేసిందని చెప్పవచ్చు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తన బాడీ లాంగ్వేజ్‌తో, తన డిక్షన్‌తో, తన స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో, తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టేశారు. ట్రైలర్‌లోనే ఇంతగా ఆకట్టుకుంటున్నారు ఈయన. ఇక సినిమాలో ఏ రేంజ్‌లో నటించి ఉంటారో ఆని బిగ్‌ బీ అభిమానులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. 'సర్కార్‌' సిరీస్‌లో ఇది టాప్‌ మోస్ట్‌ అనే స్థాయిలో ఉండబోతోందని అభిమానులు నమ్ముతున్నారు. అంత గొప్పగా వర్మ 'సర్కార్‌-3'ని డిజైన్‌ చేసినట్లే కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు అందరూ అంటున్నారు, వర్మ ఈజ్‌ బ్యాక్‌ అని. ఈ సినిమా వర్మని నిజంగానే ఇదివరకటి స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
radha adirindi raja