Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
varma is back

ఈ సంచికలో >> సినిమా >>

'రాధ' అదిరింది రాజా!

radha adirindi raja

శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'రాధ'. తాజాగా టీజర్‌ వచ్చింది. టీజర్‌లో శర్వానంద్‌ అదరగొట్టేస్తున్నాడు. ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గ్లామర్‌లో కొంచెం డోస్‌ పెంచేసినట్లు కనిపిస్తోంది ఈ సినిమాలో. పోలీస్‌ గెటప్‌లో శర్వానంద్‌ ప్లెజెంట్‌ అప్పీయరెన్స్‌ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. పోలీస్‌ అంటే సీరియస్‌ పోలీస్‌లా కనిపించట్లేదు. కొంచెం టఫ్‌గా ఉన్నట్లే కనిపిస్తూ, కామెడీ కూడా చేసేశాడు. చాలా జోష్‌గా కనిపిస్తున్నాడు శర్వానంద్‌. అచ్చం 'రన్‌ రాజా రన్‌' సినిమాలోని శర్వానంద్‌ కన్పిస్తున్నాడు. అంత యాక్టివ్‌గా ఉన్నాడు. అంతేకాదు పోలీస్‌ గెటప్‌లో చాలా స్టైలిష్‌గానూ ఉన్నాడండోయ్‌. 'రాధ' టీజర్‌ అదిరిందయ్యా రాజా అని శర్వానంద్‌ని అందరూ అభినందిస్తున్నారు. ఈ సినిమాతో చంద్రమోహన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

భోగవల్లి బాపినీడు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యడానికి అప్పట్లో కృష్ణుడు పుట్టాడు. ఇప్పుడు ఈ పోలీసోడు పుట్టాడు' అంటూ 'రాధ' టీజర్‌లో శర్వా చెప్పిన డైలాగ్‌ సింప్లీ సూపర్బ్‌ అంతే. ఈ ఏడాది స్టార్టింగ్‌లో 'శతమానం భవతి' అంటూ సెంటిమెంట్‌ పండిస్తూనే వినోదాన్ని కూడా పంచేశాడు. పల్లెటూరి కుర్రోడిలా గోదారి యాసతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడేమో స్టైలిష్‌ అండ్‌ జోష్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా మన ముందుకు వచ్చేస్తున్నాడు. మరింకేం ఈ సారి కూడా కాస్కో రాజా కాస్కో ఈ పోలీసోడి దెబ్బ. 

మరిన్ని సినిమా కబుర్లు
chiru and balakrishna records hit