Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bahubali 2 is comming

ఈ సంచికలో >> సినిమా >>

రాజుగారి గదిలో నాగ్‌, సమంత

samanta ana nag in room

చిన్న సినిమాగా వచ్చి చాలా పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం 'రాజుగారిగది'. ఈ సినిమా అంతటి విజయాన్ని సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. కొంచెం భయపెడుతూ, ఇంకాస్త నవ్విస్తూ ఆద్యంతం ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేసింది ఈ చిత్రం. దీనికి కొనసాగింపుగా 'రాజుగారిగది-2' సినిమాని దర్శకుడు ఓంకార్‌ ప్లాన్‌ చేసినప్పుడు, ఆ కథ ముందుగా నాగార్జున దగ్గరకే వెళ్ళింది. వెళ్ళడంతోనే నాగార్జున ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారంటే, ఆయన ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమవుతుంది.

ఈ సినిమాలో తాజాగా సమంతని కూడా ఎంపిక చేశారు. సమంత తాను 'రాజుగారిగది-2' సినిమాలో నటిస్తున్న విషయాన్ని ఖరారు చేస్తూ ఓ ఫొటోని కూడా విడుదల చేసింది. ఈ ఫొటో అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే నాగార్జున లుక్‌ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంకో వైపున నాగార్జున సరసన ఈ సినిమాలో 'రన్‌ రాజా రన్‌' ఫేం సీరత్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 'రాజుగారిగది' చిన్న సినిమానే అయినా, సీక్వెల్‌ మాత్రం చాలా పెద్ద సినిమా కానుంది. భారీ బడ్జెట్‌తో సాంకేతిక అంశాల పరంగా ఎక్కడా ఏమాత్రం రాజీ పడకుండా చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు ఓంకార్‌ చెప్పాడు. ఈ చిత్రంలో నాగార్జున మెంటలిస్ట్‌ (మానసిక వైద్యుడు)గా కనిపించనున్నారు. సమంత పాత్ర ఏంటనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. 

మరిన్ని సినిమా కబుర్లు
megastar start