1. మన దేశ జాతీయ జంతువు బెంగాల్ టైగర్. కానీ ఇక్కడ ఎక్కువ మంది పూజించేది ఆవుని. గోవధలు ఆపాలంటే ముందు ఆవుని జాతీయ జంతువు చెయ్యాలి. అప్పుడు గోవధ దేశ వ్యాప్తంగా చట్ట విరుద్దం అవుతుంది.ఒక వేళ గోవు ఒక్క మతానికి చెందినవారిదే అనుకుంటే, ఇప్పటికే జాతీయ పుష్పంగా వున్న కమలం కూడా ఒక మతానికే చెందినదని అనుకోవాలి..ఎందుకంటే ఒక మతానికి చెందిన దేవతలే ఆ కమలంలో కూర్చుని వుంటారు..
2. జాతీయ జంతువుగా బెంగాల్ టైగర్ ఉంది కాబట్టి ఆ జాతి అంతరించకుండా కాపాడుకుంటున్నాం. లేక పోతే ఎప్పుడో వేటకి బలి అయిపోయేది. ఆవులు అలా కాదు..వాటి సంఖ్య చాలా ఎక్కువ...అవి అంతరించి పోవు..ఆవు ని జాతీయ జంతువు చేస్తే మన సెక్యులర్ లెక్కలు సరిపోవు. ఎందుకంటే అది హిందువులు మాత్రమే పూజించేది.
పై రెండింట్లో ఏది కరెక్ట్..?
|