Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bahubali after srirama rajyam

ఈ సంచికలో >> సినిమా >>

మళ్ళీ నవ్వించి సంపాదించాలని

earnings by comedy

నిర్మాత లగడపాటి శ్రీధర్ , మంచి అభిరుచిగల నిర్మాత. సెలక్టివ్ గా మాత్రమే సినిమాలు చేసే ఈయన, ‘ఎవడిగోల వాడిదే’ సినిమాని తెరకెక్కించి కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కామెడీ బేస్డ్ సినిమాలు చేయలేదు లగడపాటి శ్రీధర్ .

చాలా రోజుల తర్వాత ‘పోటుగాడు’ సినిమాతో పూర్తిస్థాయి కామెడీ మూవీని తెలుగు ప్రేక్షకులకు లగడపాటి శ్రీధర్ అందించబోతున్నారు. మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఇటీవలే జరిగింది. ట్రైలర్ నిండా కామెడీ పాళ్ళు ఎక్కువగా కన్పిస్తున్నాయంటే, సినిమాలో కామెడీ ఏ స్థాయిలో వుందో అర్థమవుతోంది.

లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో ‘స్టైల్ ’, ‘స్నేహగీతం’ తదితర సినిమాలొచ్చాయి. ఇవేవీ కామెడీ ప్రధానమైన చిత్రాలు కావు. ‘ఎవడిగోల వాడిది’ స్థాయిలో లగడపాటి శ్రీధర్ అందిస్తోన్న ‘పోటుగాడు’ ప్రేక్షకుల్ని అలరించడం ఖాయంగానే కన్పిస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
I can't do that - Hansika