Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ami tumi movie review

ఈ సంచికలో >> సినిమా >>

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్వీటీ

sweety is so clarity

గత కొంత కాలంగా స్వీటీ పెళ్లి కబురు కోసం ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు. టాలీవుడ్‌లో అనుష్క మోస్ట్‌ వాంటెడ్‌ క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌. అవును నిజమే మన స్వీటీ అనుష్కకి పెళ్లి వయసు కూడా దాటిపోతోంది. అయినా కానీ వరుస అవకాశాలు ఆమెని హీరోయిన్‌గా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఇటీవలే 'బాహుబలి' సినిమాతో అనుష్కకి తిరుగులేని స్టార్‌డమ్‌ వచ్చేసింది. కెరీర్‌లో పలు విభిన్న క్యారెక్టర్స్‌లో అనుష్క నటించేసింది. ఇంకా నటిస్తూనే ఉంది. ప్రస్తుతానికి ఆమె చేతిలో మరో భారీ ప్రాజెక్టు ఉంది. అదే భాగ్‌మతి'. ఈ సినిమా షూటింగ్‌లో ప్రస్తుతం అనుష్క బిజీగా ఉంది. మరో పక్క అనుష్క పెళ్లి కబురు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. 'బాహుబలి' ప్రబాస్‌ - దేవసేన అనుష్క ఈ ఇద్దరిదీ మంచి పెయిర్‌. ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు కూడా సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి. దాంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్‌ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అలాంటిదేమీ లేదంటూ స్వీటీ బ్యూటీ నోరు విప్పింది. ప్రబాస్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమే. అంతేకానీ మా ఇద్దరికీ పెళ్లి చేసుకునేటంత చనువు లేదు అని స్వీటీ తేల్చేసింది. మరో పక్క ప్రబాస్‌ పెళ్లి విషయంలో కూడా జాప్యం జరుగుతుండడంతో ఇలాంటి గాసిప్సే చక్కర్లు కొడుతూంటాయి మరి. ఏదేమైనా స్వీటీ పెళ్లి చేసుకోబోతుందంటే ఓ వర్గం ఆనందించినా మరో వర్గం ప్రేక్షకులు నిరాశ పడతారు. పెళ్లి చేసేసుకుంటే స్వీటీ సినిమాల్లో నటిస్తుందో లేదో తెలీదు కదా అందుకు. 

మరిన్ని సినిమా కబుర్లు
big celebrities support