Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
big celebrities support

ఈ సంచికలో >> సినిమా >>

సాహసమే బాలయ్య ఊపిరి

balayya so dare person

పూరీ - బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి 'పైసా వసూల్' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. పూరీ సినిమాల్లో టైటిల్‌ దగ్గర నుండి, హీరో క్యారెక్టరైజేషన్‌ దాకా అన్నీ కొత్తగా ఉంటాయి. ఆ హీరో కొత్త వాడైనా, సీనియర్‌ హీరో అయినా సరే తన సినిమాలో హీరో అంటే టోటల్‌గా ఆ హీరో బాడీ లాంగ్వేజ్‌ ఛేంజ్‌ అయిపోతుంది. అందుకే బాలయ్య కూడా ఏమీ తక్కువ కాదనిపిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్యని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా చూపించబోతున్నాడు పూరీ. రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో బాలయ్య నటిస్తున్నాడు ఈ సినిమాలో. రెండు గెటప్స్‌ చాలా కొత్తగా ఉండబోతున్నాయట. పూరీ సినిమాల్లో హీరో చాలా పవర్‌ ఫుల్‌గా కనిపిస్తాడు. హీరోయిజం అంటే ఇలాగే ఉంటుందా.. అనేట్లుటుంది హీరో క్యారెక్టరైజేషన్‌ పూరీ సినిమాలో. అందుకు తగ్గట్లుగానే బాలయ్యని కూడా చూపించనున్నాడట. అలాగే డాన్సులు, ఫైట్లు విషయంలో కూడా బాలయ్య ఏమాత్రం తగ్గడం లేదట. వయసుతో సంబంధం లేకుండా ఎక్కడా రాజీ పడకుండా, రిస్కీ షాట్స్‌ని కూడా భళా బాలయ్య భళా అనే రేంజ్‌లో చేసేస్తున్నాడట. ఆయన ఎనర్జీకి చిత్ర యూనిట్‌ ఫిదా అయిపోతోంది. శ్రియ, ముస్కాన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కైరా దత్‌ ఐటెం సాంగ్‌ చేస్తోంది. ఛార్మి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే ఈ సినిమాను సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పూరీ అండ్‌ టీమ్‌ సన్నాహాలు చేస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
DJ how many crores cross