రచయితగా ఎన్నో సక్సెస్‌ఫుల్ కథల్ని అందించిన వక్కంతం వంశీ మెగాఫోన్ పట్టి, తెరకెక్కిస్తున్న సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమాతో మన ముందుకు రానున్నాడు బన్నీ. జూన్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'బాహుబలి' సినిమా తర్వాత రాబోతున్న పెద్ద సినిమా ఇది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే కొత్త సినిమాని షురూ చేసేశాడు బన్నీ. డిఫరెంట్ టైటిల్‌తో విడుదలకు ముందే భారీ అంచనాలు నమోదు చేస్తోంది ఈ సినిమా. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. లగడపాటి శిరీష, శ్రీధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
పలు సక్సెస్‌ఫుల్ మూవీస్‌ని తమ సంస్థ నుండి అందించారు లగడపాటి శ్రీధర్. ఎప్పటి నుండో బన్నీతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు ఆయన. ఈ సినిమాతో ఆయన కోరిక తీరనుంది. జూలై నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు. సీనియర్ నటులు అర్జున్, శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరత్‌కుమార్‌తో ఆల్రెడీ అల్లు అర్జున్ నటించిన 'బన్నీ' సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్‌తో సీనియర్ హీరో అర్జున్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
|