బాలయ్య - పూరీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ప్రస్తుతం పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇది చాలా పెద్ద షెడ్యూల్. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించిన సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయట. షూటింగ్ పార్ట్ అంతా చాలా బాగా జరిగిందంటూ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. అన్నట్లు ఈ సినిమాకి 'పైసా వసూల్' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. పూరీ సినిమా టైటిల్స్ అన్నింటికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. వాటన్నింట్లోకీ ఈ టైటిల్ అత్యంత ప్రత్యేకం. బాలయ్యకు ఈ సినిమా 102వ చిత్రం కావడంతో ఈ సినిమాపై పూరీ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు. షూటింగ్ స్పాట్‌లో బాలయ్య ఎనర్జీకి చిత్ర యూనిట్ అంతా షాక్ తింటున్నారట.
డాన్సులు, ఫైట్లు అదరగొట్టేస్తున్నారట బాలయ్య. ఆయన ఎనర్జీ లెవెల్స్‌ని అందుకోవడం తమ వల్ల కావడం లేదంటున్నారు యంగ్ ఆర్టిస్టులు కూడా. బాలయ్య కెరీర్‌లోనే సరికొత్త రికార్డులు నమోదు చేయనుందని ఈ సినిమా అంతా అనుకుంటున్నారు. అంత మంచి ఔట్ పుట్ వచ్చిందట పోర్చుగల్‌లో చిత్రీకరించిన సన్నివేశాలకు. శ్రియ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ పోషిస్తుండగా, మరో ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ ముద్దుగుమ్మలే ముస్కాన్, కైరాదత్. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ లుక్‌లోని బాలయ్య స్టిల్‌కి ఇండస్ట్రీలో పోజిటివ్ టాక్ మొదలైంది. విడుదలకు మందే బాలయ్య అంచనాలు అదరగొట్టేస్తున్నారు. దాదాపుగా పోర్చుగల్‌లో చివరి దశకు చేరుకుంది ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్‌కి రంగం సిద్ధం చేసేస్తోంది చిత్ర యూనిట్. సెప్టెంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|