మంచు మనోజ్ ఈ మధ్య ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మనోజ్ ఇకపై సినిమాలు మానేస్తున్నాడా? అంటూ అంతా ఖంగు తిన్న టైంలో వెంటనే మనోజ్ రీ ట్వీట్ చేసి మరోసారి షాకిచ్చాడు. అయితే ఇదంతా మనోజ్ తన కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ని విభిన్నంగా తెలపాలనే ఉద్దేశ్యంతోనే చేశాడట. అయితే అది విఫలమై ఇంకేదో అయ్యింది. ప్రస్తుతం మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మనోజ్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. అందుకలో ఒకటి మిలిటెంట్ ఎల్‌టిటిఈ ప్రభాకరన్ పాత్ర. ఈ పాత్ర కోసం మనోజ్ చాలానే వెయిట్ పెరిగాడు. ఇంకో పాత్ర సామాన్యమైన కాలేజ్ స్టూడెంట్ పాత్ర. ఈ పాత్రలో మనోజ్ స్లిమ్‌గా కనిపిస్తాడు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
పోరాటం బ్యాక్ డ్రాప్‌లో జరిగే స్టోరీ ఇది. ఇందుకోసం మనోజ్ చాలా కష్టపడాడట. పోరాట ఘట్టాలు అందర్నీ ఆకట్టుకునేలా ఉంటాయట. అసలే మనోజ్‌కి ఫైట్ సీన్స్ అంటే చాలా ఇష్టం. తన సినిమాల్లో చాలా వరకూ ఫైట్ సీన్స్ తానే కంపోజ్ చేసుకుంటూ ఉంటాడు. ఈ సినిమాలో పోరాట ఘట్టాలపై కొంచెం ఎక్కువే కాన్‌సన్‌ట్రేషన్ చేశాడట మనోజ్. అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మంచు మనోజ్.
|