Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Nalugurito Narayana

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (06 సెప్టెంబర్ - 12 సెప్టెంబర్) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు ఆశించిన ఫలితాలను కొంత నిదానంగా పొందుటకు అవకాశం కలదు. ఓపికగా పనిచేయుట మూలాన ఆశించిన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. శుక్రవారం చేపట్టిన పనులను నిదానంగా ముందుకు తీసుకువెళ్ళు ప్రయత్నం చేయుట మంచిది కొంతమేర ఆందోళనను కలిగి ఉండే అవకాశం కలదు. శని, ఆదివారాలు ఇతరులకు సేవచేయుట మూలాన మంచి పేరును పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన అంశాల్లో బాగుంటుంది. సోమ, మంగళవారాల్లో గతంలో చేపట్టిన పనుల మూలాన కీర్తిని పొందుతారు. బుధ, గురువారాల్లో స్వల్ప అనారోగ్య సమస్యలు పనిఒత్తిడి వలన కలిగే అవకాశం కలదు జాగ్రత్త. మిత్రులతో కలిసి చేపట్టిన పనులలో ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. మీరు తీసుకొనే నిర్ణయాల్లో కొంత తడబాటు ఉంటుంది. పనులలో శ్రమను కలిగి ఉంటారు. చేపట్టిన పనులను చివరకు విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. సోదరుల నుంచి రావాల్సిన స్థాయిలో సహాయం అందకపోవచ్చును. ఉద్యోగంలో స్వల్ప మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది. కుటుంబంలో శ్రమను కలిగి ఉంటారు. నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది.       

వృషభ రాశి
ఈవారం మీరు ప్రారంభంలో తడబాటును ఎదుర్కొనే అవకాశం కలదు. శ్రమిస్తే తప్పక విజయంను పొందుటకు అవకాశం కలదు. శుక్రవారం తలపెట్టిన పనులలో కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం కలదు, నిదానంగా పనిచేయుట అవసరం. శని, ఆదివారాల్లో అనారోగ్య సమస్యల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. పనులలో ఆశించిన ఫలితాలు రాకపోవడం వలన బాధకు గురయ్యే అవకాశం ఉంది. సోమ, మంగళ వారాల్లో కుటుంబంలో అనుకూలమైన మార్పులు కలుగుటకు అవకాశం ఉంది. ఇతరులకు సహాయపడే ఆలోచనను కలిగిఉండే ఆస్కారం ఉంది. ఆర్థికంగా లాభంను కలిగి ఉంటారు. బుధ, గురువారాల్లో నిదానంగానైనా చేపట్టిన పనులను పూర్తిచేయుటకు అవకాశం ఉంది. మీరు చేసిన పనుల మూలాన గౌరవాభివృద్దిని కలిగి ఉంటారు. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. ఇష్టమైన పనులను పూర్తిచేయగలుగుతారు. అధికారుల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. ధార్మిక సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. క్రిందిస్థాయి ఉద్యోగుల వలన లబ్దిని పొందుతారు. 

మిథున రాశి
ఈవారం మీరు మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. పెద్దల సహకారంతో ముందుకు వెళ్ళుటకు ప్రయత్నం చేయుట మంచిది. శుక్రవారం ఇష్టమైన వ్యక్తులతో కలిసి పనులను చేపడుతారు. తలపెట్టిన పనులలో లాభంను పొందుటకు అవకాశం కలదు. శని, ఆదివారాల్లో బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకండి. నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. సోమ, మంగళవారాల్లో ఆశుభవార్తను వినే అవకాశం కలదు. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు ఆస్కారం ఉంది ప్రణాళిక ప్రకారంతో ముందుకు వెళ్ళుట మంచిది. బుధ, గురువారాల్లో కుటుంబ సభ్యుల సహకారంతో పనులను పూర్తిచేస్తారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ధనలాభంను పొందుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో సహకారంను పొందుటకు అవకాశం ఉంది. సంతాన మూలక సౌఖ్యంను కలిగి ఉంటారు. క్రయవిక్రయముల మూలాన లాభంను పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట మంచిది. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. పెద్దలతో పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది చేపట్టిన పనుల మూలాన గౌరవాభివ్రుద్దిని పొందుతారు.  

కర్కాటక రాశి
ఈవారం చేపట్టే పనులలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మూలాన మేలుజరుగుతుంది. శుక్రవారం ఆర్థికపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. స్వల్పంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. శని, ఆదివారాల్లో నూతన వస్త్రలాభం కలుగుతుంది. ఇష్టమైన వారిని కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. సోమ, మంగళ వారాల్లో ప్రయత్నాలలో శ్రమను పెంచుట అధికమైన సమయాన్ని కేటాయించుట మూలాన పనులు ముందుకు సాగుతాయి. బుధ, గురువారాల్లో కలుగు ఫలితాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. చేపట్టిన పనులలో ఫలితాలు ఆలస్యంగా వచ్చుటకు ఆస్కారం ఉంది. ప్రమాదాలు సంభవించే అవకాశం కలదు. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండుట మంచిది. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. సమయానికి భోజనం చేయుట వలన మేలుజరుగుతుంది. చంచల మనస్సును కలిగి ఉంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాలు చేయుట మూలాన ఖర్చులు పెరుగుతాయి. శ్రమను పొందుటకు అవకాశం ఉంది. వ్యతిరేక వర్గం నుండి వచ్చు సమస్యలను నిదానంగా పరిష్కరించే ప్రయత్నం చేయుట ఉత్తమం. వ్యాపారంలో మాత్రం ఇబ్బందులు తప్పక పోవచ్చును.

సింహ రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేపట్టే పనుల పట్ల చక్కటి అవగాహన కలిగి ఉండుట తప్పక మేలుచేస్తుంది. శుక్రవారం ఆర్థికంగా చేపట్టిన పనులలో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. శని, ఆదివారాల్లో ఫలితాలు మీరు ఆశించిన విధంగా రాకపోవచ్చును. సర్దుకుపోవడం ఉత్తమం. సోమ, మంగళ వారాలలో ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. మనోధైర్యంను కలిగి ఉండి పనులలో ముందుకు వెళ్ళుటకు ఆస్కారం కలదు. బుధ, గురువారాల్లో బంధువులతో అలాగే మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు చేయకపోవడం అనేది సూచన. అలాగే వారితో మాటపట్టింపులకు పోకండి. వారంలో కొంత ప్రతికూల పవనాలు వీస్తాయి, కావున జాగ్రత్తగా ఉండుట సూచన. అకాలభోజనం చేసే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు భాదించే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుట తప్పక మేలుచేస్తుంది. అధికంగా సంచారం చేయుట మూలాన శ్రమను పొందుతారు. ఖర్చులు కలుగుటకు ఆస్కారం ఉంది. కలహములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట అన్నివిధాల శ్రేయస్కరం. పెద్దలతో కలిసి పనిచేయుట మంచిది వ్యతిరేక వర్గం వారిని జయించుటకు అవకాశం కలదు. కుటుంబంలో కలుగు మార్పులు సంతోషాన్ని కలుగజేస్తాయి. దేహసౌఖ్యంకు ప్రాముఖ్యతను ఇస్తారు. 

కన్యా రాశి
ఈవారం పనులకు సంబంధించిన విషయాల్లో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరి వరకు ఉండకపోవచ్చును. శుక్రవారం అనవసరపు ఆలోచనలు చేపడుతారు. వాటి మూలాన అనుకోని ఖర్చులను పొందుటకు అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో పనుల విషయంలో ఉత్సాహమును కలిగి ఉంటారు. ఆర్థికంగా కలిసి వచ్చే సూచనలు కలవు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. మిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. సోమ, మంగళ వారాల్లో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించుట మేలు. ఆశించిన ఫలితాలు రాకపోవడం వలన మనోవిచారంను కలిగి ఉంటారు. బుధ, గురువారాల్లో పెద్దల సూచనలు పాటించుట చేత లాభంను పొందుతారు. అనుకున్న పనులను పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు కలిసి రాకపోవచ్చును వాటిమూలన ఖర్చు తప్పదు. స్థానచలనం సూచితం మార్పు ఉంటుంది. ప్రయత్నాలలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలుచేయునపుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట ఉత్తమం. ఆర్థికంగా నూతన అవకాశాలు పెరుగుటకు అవకాశం ఉంది. బంధువులతో మాటపట్టింపులు కూడదు. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు.

తులా రాశి
ఈవారం ఆశించిన ఫలితాలు కలుగుటకు ఆస్కారం కలదు. కాకపోతే ఓపికను కలిగి ఉండుట మేలుచేస్తుంది. శుక్రవారం బంధువులతో, మిత్రులతో సమయాన్ని గడుపుతారు. వారివలన నూతన సమాచారం తెలిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో ఆలోచనలు పెరుగుటకు అవకాశం కలదు. ఖర్చులు కలిగి ఉంటారు సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. సోమ, మంగళ వారాలలో నూతన ప్రయత్నాలు ఆరంభించి వాటిని విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం కలదు. ఆర్థికంగా బాగుంటుంది అవకాశాలు పెరుగుతాయి. బుధ, గురువారాల్లో మాటపట్టింపులకు పోకండి సర్దుబాటు స్వబావం మేలుచేస్తుంది. మంఛిపనులను చేపట్టుట మూలాన అందరిలోను పేరును కలిగి ఉంటారు. అనారోగ్య పరంగా మాత్రం ఇబ్బందులను పొందుతారు చక్కటి భోజనం చేయుట మంచిది. సంచారం చేయుట వలన అలసిపోతారు. కుటుంబంలో చిన్న చిన్న మార్పులు తప్పవు. సర్దుబాటు అవసరం. గృహం విషయంలో మీరు తీసుకొనే నిర్ణయాలు ఫలితాలను ఇచ్చుటకు అవకాశం ఉంది. విందులలో పాల్గొనే అవకాశం ఉంది వస్తువులను మాత్రం జాగ్రత్తగా కాపాడుకొనే ప్రయత్నం మాత్రం చేయండి.  

వృశ్చిక రాశి
ఈవారం అనుకూలమైన ఫలితాలు కలుగుటకు అవకాశం కలదు. ప్రణాళికా బద్దంగా నడుచుకుంటే మేలుజరుగుతుంది. శుక్రవారం తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం కలదు. బంధువుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు. శని, ఆదివారాల్లో బంధువుల గృహంలో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో తప్పక లాభంను పొందుతారు. ఇష్టమైన పనులను చేపడుతారు. సోమ, మంగళ వారాలలో కొంతమేర ఆలోచనలు పెరుగుటకు అవకాశం కలదు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. తోటివారితో కలిసి పనులను చేపట్టునపుడు నిదానంగా వ్యవహరించుట మేలు. బుధ, గురువారాల్లో ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. చేసిన పనులలో గుర్తింపును పొందుతారు. రాజకీయాలలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది, అధికారుల మూలాన లబ్దిని పొందుతారు. స్థానచలనంకు అవకాశం కలదు నిదానంగా వ్యవహరించుట మేలు. భోజనం విషయంలో అశ్రద్ద కూడదు సమయానికి భోజనం చేయుట వలన మేలుజరుగుతుంది. కోపంను తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. అందరి మెప్పును పొందాలనే తాపత్రయం మీలో కనబడుతుంది.

ధనస్సు రాశి
ఈవారం మీరు రాజకీయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు కాకపోతే సరైన నిర్ణయాలు తీసుకోవడం సూచన. శుక్రవారం కుటుంబంలో నూతన ఆలోచనలు చేయకండి. ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు తప్పకపోవచ్చును. శని, ఆదివారాల్లో ప్రయత్నాలలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఇష్టమైన పనుల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. సోమ, మంగళవారాలలో ఆర్థిక, పరమైన విషయాల్లోన లాభంను పొందుటకు అవకాశం ఉంది. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. బుధ, గురువారాలలో పెద్దల సలహాలను పాటించుట ద్వార  మేలు జరుగుతుంది. పనులలో నిదానం అవసరం అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన వస్తువులను కొనడం మూలాన ఖర్చు పెరుగు సూచనలు ఉన్నవి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. గతంలో తీసుకున్న అప్పుల మూలాన భాదను పొందు సూచనలు ఉన్నవి. మీయొక్క మాట తీరును కొందరు వ్యతిరేకించే అవకాశం కలదు, నిదానం అవసరం. రాజకీయాలలో రాణించాలనే మీకోరికకు ఆలోచన తోడవుతుంది. శత్రువుల మూలాన భయంను పొందుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది.  

మకర రాశి
ఈవారం మీరు మొదట్లో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశీయానం కలిసి వచ్చే అవకాశం కలదు. శుక్రవారం అనారోగ్య సమస్యలు కలుగుట వలన బాధను పొందుటకు అవకాశం ఉంది. శని, ఆదివారాలలో కుటుంబంలో స్వల్ప విభేదాలు కలుగుటకు ఆస్కారం కలదు. నిదానంగా వ్యవహరించుట మేలు. మరొక ప్రదేశంలో నివసించవలసి రావచ్చును. సోమ, మంగళవారాలలో ఇష్టమైన పనులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. బంధువులతో కలిసి నూతన పనులను ఆరంభించే అవకాశం కలదు. ఆర్థికంగా కలిసి వస్తుంది నూతన పనులను చేపడుతారు. బుధ, గురువారాలలో శుభకార్యక్రమలలొ పాల్గొనే అవకాశం ఉంది. సంతోషంగా గడుపుతారు. వారంలో అనుకోని వార్తను వినే అవకాశం కలదు. బాధను పొందుతారు. కుటుంబంలో సర్దుకుపోవడం మేలుచేస్తుంది. అవతలి వారి మాటను వినే ప్రయత్నం చేయండి. అధికారులతో ఇబ్బందులను పొందుతారు. ఉద్యోగంలో పనిభారంను కలిగి ఉంటారు. మీ అనుకున్న వాళ్ళనుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కలదు. మంచి ప్రవర్తన మూలాన పెద్దలలో గుర్తింపును తెచ్చుకుంటారు.

కుంభ రాశి
ఈవారం మీరు నూతన ప్రయత్నాలు ఆరంభించే ముందు పెద్దల సూచనలు పాటించుట వలన ఆశించిన ఫలితాలను పొందుతారు. శుక్రవారం అర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. అందరిలో గుర్తింపును పొందుటకు చేసిన ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను కలుగజేస్తాయి. శని, ఆదివారాల్లో అజీర్తిమూలక సమస్యలు కలుగుతాయి. జాగ్రత్తగా వ్యవహరించుట అలాగే భోజనం విషయంలో జాగ్రత్తలు పాటించుట మంచిది. సోమ, మంగళ వారాలలో నూతన ప్రయత్నాలు వాయిదా వేసుకొనుట మేలు. మీయొక్క సలహాలను కుటుంబంలో సభ్యులు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమస్యలు తప్పకపోవచ్చును. బుధ, గురువారాలలో చేపట్టిన పనులలో పెద్దల సహకారం చేత లాభంను పొందుతారు. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ప్రయత్నాలలో గట్టిగా కృషి చేయుట ఉపయోగ పడుతుంది. వారంలో ఆర్థికపరమైన విషయాల్లో ఇతరుల ద్వారా కలిసి వస్తుంది. పరులకు సహాయం చేయుట మూలాన పేరును కలిగి ఉంటారు. అధికారులతో నిదానంగా వ్యవహరించుట సూచన, మంచివారితో మీకున్న పరిచయాలు తప్పక అనుకూలిస్తాయి. ఉద్యోగంలో తీసుకున్న నిర్ణయాలు మేలుచేస్తాయి. గుర్తింపు లభిస్తుంది. బంధువులతో లేక మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. 

మీన రాశి
ఈవారం మీరు ప్రతిపనిని ఒకటికి రెండు సార్లు అలోచించి చేయుట మూలాన పనులు ముందుకు సాగుతాయి. మిత్రుల సహకారం పొందుతారు. శుక్రవారం కుటుంబంలో సౌఖ్యంను పొందుతారు, ఆర్థికంగా లాభం ఉంటుంది. శని, ఆదివారాలలో చేపట్టిన పనుల మూలాన గుర్తింపు లభిస్తుంది. మంచిపనులను చేపడుతారు మీ ఆలోచనలు తోటివారికి సహాయపడుతాయి. సోమ, మంగళ వారాలలో అనారోగ్య సమస్యలు స్వల్పంగా ఇబ్బందిని పెట్టె అవకాశం ఉంది జాగ్రత్త. అనుకోని పనులను చేపట్టవలసి రావచ్చును ఇందుమూలన శ్రమను కలిగి ఉంటారు. బుధ, గురువారాల్లో కలిగిన మార్పులను పెద్దగా ఇష్టపడకపోవచ్చును. ఉద్యోగంలో స్వల్ప మార్పులు కలుగుతాయి. సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచిది. ప్రయత్నాలలో నూతన ఆలోచనలు అమలుచేసే అవకాశం ఉంది. మిత్రుల సహకారంను పొందుతారు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. సమయానికి భోజనం చేయండి. పనిభారం ఉంటుంది. శ్రమను పొందుతారు. అకారణంగా కలహములు కలుగుటకు ఆస్కారం ఉంది. కావున నిదానంగా వ్యవహరించుట అందరిని కలుపుకొని వెళ్ళుట మేలు. స్థానచలనం ఉంటుంది. అనుకోని ఖర్చును పొందుటకు ఆస్కారం ఉంది. అకారణంగా భయంను పొందుతారు. అధికారులకు అనుగుణంగా నడుచుకొనే ప్రయత్నం చేయుట మంచిది.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Book Review - Dasarathi Sahityam