Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి   http://www.gotelugu.com/issue219/615/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి )..  

లిఫ్ట్‌లో అతని పక్కననిలుచున్న ముప్పై సెకండ్లు కూడా మర్చిపోలేని అనుభూతిగా ఆమె మనసులో ముద్రపడింది.
కిందకి వచ్చాక. లాంచ్ లోంచి కారు పార్కింగ్‌ వైపు వెళ్ళి కారు తీసుకొచ్చి ఆమె ముందు ఆపాడు.

ఆమె ఆశ్చర్యపోతూనే కారెక్కి ఫ్రంట్‌ సీట్లో కూర్చుంటూ,

‘‘మీరూ మాతో పాటే ట్రెయిన్‌లో వచ్చారు కదా! మరి ఈ కారు అర్ధోక్తిలో ఆపింది.

‘‘మా ఫ్రెండ్‌ది’’ చెప్పాడు.

కాసేపాగి ‘‘ఫస్ట్‌ ఎక్కడికెళదాం?’’ అడిగాడు.
 

‘‘ఏదన్నా టెంపుల్‌కి వెళ్దాం....’’ చెప్పింది.~

అతనికి మురుగన్‌ కోవెల గుర్తొచ్చింది. వడపళనిలో ఉన్న టెంపుల్‌ అది.

టెంపుల్‌కి వెళ్ళాక అక్కడి ఆడవాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపడింది కీర్తన. చెవులకీ, ముక్కులకీ, చేతులకీ, మెళ్ళోకీ అన్నీ ఆభరణాలే. చెయ్యంత వెడల్పు అంచున్న కంచి పట్టు జరీచీరలు...తల నిండా నారతో కట్టిన పూలు, నుదుటి మీద అడ్డంగా విబూది.

‘‘ఇంత అలంకరణకి వాళ్ళకి ఎంత టైం పడుతుందో?’’ ఆశ్చర్యపోతూ అంది.

‘‘అందరూ మీలాగా వుండరుగా!’’ ఆకాష్‌ అన్నాడు.

‘‘అఫ్‌కోర్స్‌....!’’ అని వూరుకుంది.

గుళ్ళో శ్రద్ధగా దండం పెట్టుకుంటున్న కీర్తనని చూశాడు.

బైటకి వచ్చాక...‘‘దేవుణ్ణి ఏమని కోరుకున్నారు?’’ అని అడిగాడు.

‘‘నేను ఇంత వరకూ దేవుడ్ని ఏమీ అడగలేదు. నాకు కావలిసింది మా అన్నయ్యనే అడిగేదాన్ని. ఇప్పుడు మా అన్నయ్యని అడగలేని ఒక విషయం దేవుడ్ని కోరాను.’’

‘‘ఏంటది....?’’ కుతూహలంగా అడిగాడు.

‘‘నా ఆట మీద మీకున్న అభిమానాన్ని కలకాలం యిలాగే వుండనివ్వమని’’ మనస్ఫూర్తిగా అంది.

అతని మొహం వివర్ణమయింది.... కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు.

‘‘మరి మీరేం కోరుకున్నారూ?’’ తనూ ఆసక్తిగా అతని మొహం చూస్తూ అంది. బలహీనంగా నవ్వాడు.

‘‘మీరు దేవుడ్ని ఏమని ప్రార్థించారో అది జరగాలని కోరుకున్నాను’’ అన్నాడు.

‘‘ఈజిట్‌! చూశారా దేవుడి దగ్గర మనిద్దరి ఆలోచనలూ కలిశాయి. అందుకే అంటారు. దైవ మహిమ వుంటుందని’’ సంతోషంగా అంది.

అర గంటలో గుడి నుంచి బయటకొచ్చారు. కారులో కూడా అతను మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్లు పరధ్యానంగా గడిపాడు.

అదేం గమనించలేదు కీర్తన.

గలగలా ఏదో మాట్లాడుతూనే వుంది.

‘‘నాతో ఉన్నట్లు ఫ్రెండ్లీగా ఇది వరకు ఎవరితోనన్నా ఉండేవారా?’’ సడెన్‌గా అడిగాడు.

‘‘మీతో ఉన్నట్లా? వూ....ప్చ్‌...లేదు...నేనసలు మా ఫ్రెండ్స్‌తో కూడా బైటకి వెళ్ళను. నాకు ఎవరి కంపెనీ నచ్చదు. బోర్‌! అబ్బాయిు చాలా మంది నాతో మాట్లాడటానికి,  ఫ్రెండ్‌షిప్‌ చేయడానికి ట్రై చేశారు. కానీ నాకు ఎవరితోనూ మాట్లాడబుద్ధి అయ్యేది కాదు.

ఎందుకో మీతోనే మాట్లాడాలనిపిస్తోంది. బహుశా నాలాగా వాలీబాల్‌ మీక్కూడా ప్రాణం అవడం రీజనేమో!

అదీకాక నా పన్నెండో ఏట నుంచీ ఇప్పటి వరకూ, నేనాడిన మెయిన్‌ టోర్నమెంట్స్‌ అన్నీ చూశానన్నారు.

అన్నేళ్ళ నుంచీ అంత బాగా నా గురించి శ్రద్ధ చూపిన మీకంటే నాకు ఆత్మీయులు ఎవరుంటారు?

నేను మీతో మాట్లాడటం గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అనుకోనివ్వండి. ఈ గాసిప్స్‌కి నేనసలు ప్రాధాన్యమివ్వను.

నా మనసుకి ఏది నచ్చితే, ఏది మంచిదనిపిస్తే ఆ పనే నేను చేస్తాను. ఈ విషయంలో నేను ఎవరికీ భయపడను’’ ఒకింత ఉద్రేకంగా అంది.

మౌనంగా విన్నాడతను. మనసు బాధగా మూలిగింది. అప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అవడంతో దారిలో ఎదురయిన హోటల్‌కి పోనిచ్చాడు కారు.

అక్కడ రెస్టారెంట్‌లో ంచ్‌ చేసి బయటకి వచ్చారు. అక్కడే షాపింగ్‌ చేశాడు. అతనికి డ్రస్సెస్‌, పెర్‌ఫ్యూమ్స్‌, వాలెట్‌, బెల్ట్స్‌ అసు డబ్బంటే లెక్కలేనట్లు క్రెడిట్‌ కార్డ్‌ యూజ్‌ చేశాడు.

అతనింకా ఏవో పర్చేజ్‌ చేస్తుంటే పక్కకి వెళ్ళి నిల్చుని..

‘‘మీకు బాగా డబ్బుందా?’’ అమాయకంగా అంది.

ఆ ప్రశ్నకి పగలబడి నవ్వాడు. కళ్ళెంబడి నీళ్ళు తిరిగాయి.

‘‘ఎందుకు నవ్వుతున్నారు?’’ సంభ్రమంగా అతని నవ్వు చూస్తూ అంది కీర్తన.

‘‘మీరు చాలా ఇన్నోసెంట్‌.’’

‘ఏం’ అన్నట్లు చూసింది.

‘‘అలా ఎవర్నయినా అడగొచ్చా?’’ పెద్దరికంగా అన్నాడు.

‘‘ఎవరినైనా అడగలేదుగా! మిమ్మల్నే అడిగాను’’ అంది.

అప్పుడు అర్ధమైంది అతనికి. ఆమె చిన్ని ప్రపంచంలో వాలీబాల్‌ సరసన తనకు కూడా చోటు దొరికిందని.

‘‘సరే అయితే! మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలా?’’ అడిగాడు.

‘‘వద్దులెండి....అడగటం నాదే పొరపాటు. అసలు మీరెవరో, ఏం చేస్తుంటారో కూడా మీరు చెప్పలేదు’’ నిష్టూరంగా అంది.

‘‘నా పేరు ఆకాష్‌. ఏం చేస్తుంటానంటే ఇదుగో ఇలా కీర్తనా దేవి టోర్నమెంట్ల చుట్టూ తిరుగుతాను’’ తమాషాగా అన్నాడు.

‘‘నేనడిగింది జాబా? ఎడ్యుకేషనా? బిజినెస్సా అని?’’ బుంగమూతి పెట్టి అంది.

‘‘ఎం.బి.ఎ. చేశాను.’’

‘‘ఈజిట్‌! మా బ్రదర్‌ కూడా ఎం.బి.ఎ.నే. మీరు ఎక్కడ చదివారు?’’

క్షణం తటపటాయించి...‘ఇంకెక్కడ హైదరాబాద్‌లోనే!’ అన్నాడు.

‘‘అయితే ఇపుడేం చేస్తున్నారు?’’ ఆసక్తిగా అంది.

‘‘బిజినెస్‌’’ చెప్పాడు.

అతని మాటలు కట్‌ చేస్తున్నట్లు వుండటంతో ఆ వివరాలు చెప్పడం ఇష్టం లేదేమోననుకుంది.

అతను ఒక ఫాన్సీ శారీ, బ్లౌజ్‌, పెటీకోట్‌ సెట్‌ తీసుకోవటం చూసి

‘‘ఎవరికీ? మీకు సిస్టర్స్‌ వున్నారా?’’ అడిగింది.

‘‘పర్సనల్‌’’ అన్నాడు.

‘‘ఓ!సారీ....మీ గర్ల్ ఫ్రెండ్‌కా?’’ రహస్యంగా అంది.

‘‘అలాంటి వాళ్ళెవరూ నాకు లేరు. ఉంటే గింటే మీరే నా గర్ల్ ఫ్రెండ్‌’’ ధైర్యం చేసి అనేశాడు.

‘‘ఊహూ మీరూ, నేనూ, వాలీబాల్‌ ఒక జట్టు. మనం గేమ్‌ ఫ్రెండ్స్‌మి. మనల్ని కలిపింది వాలీబాల్‌’’ అంది.
వెంటనే అక్కడి నుంచి పారిపోయి, తలని దేనికయినా పగలకొట్టుకోవాలనిపించింది ఆకాష్‌కి..

మొహం గంటుపెట్టుకుని నిల్చున్నాడు. తనంత తప్పు ఏం చేసిందో అర్ధంగాక కామయిపోయింది కీర్తన.
షాపింగ్‌లో కీర్తన ఏమీ తీసుకోలేదు.

‘‘మీరేమీ కొనరా?’’ అడిగాడు ఆకాష్‌.

‘‘ఊహూ! మనీ నేను చాలా పొదుపుగా వాడతాను. నాకు అవసరమయినవి అనుకున్నవే కొంటాను’’ చెప్పింది.
భుజాలు ష్రగ్‌ చేసి వూరుకున్నాడు.

సాయంత్రం వరకూ షాపింగ్‌తోనే సరిపోయింది. సెలెక్షన్‌లో అతనికి హెల్ప్‌ చేసింది కీర్తన.

ఆమె సెలెక్షన్‌ చూసి ‘‘ఫర్లేదే టేస్ట్‌ వుందే...’’అంటూ అభినందించాడు. ఉడుక్కోలేదామె. హాయిగా నవ్వేసింది.
సాయంత్రం అయిదయింది.‘‘వాట్‌ నెక్ట్స్‌?’’ అడిగింది కీర్తన.

‘‘బీచ్‌.’’

‘‘ఓ.కె.’’ చెప్పింది. సముద్రాన్ని చూస్తే కీర్తనకి చాలా ఆనందం. ఇంత వరకూ రెండు సార్లు మాత్రమే, అదీ చిన్నప్పుడు డాడీతో ఒకసారి, వైజాగ్‌ టోర్నమెంట్‌కి వెళ్ళినపుడు మరోసారి మాత్రమే ఆమె సముద్రాన్ని చూసింది.

‘‘సముద్రమంత గంభీరమైందీ....

సముద్రమంత లోతయినదీ నేనింతవరకూ చూడలేదు’’ అంది.

నురుగు కక్కుతూ దూరం నుంచి కనిపిస్తున్న సముద్రం వైపు చూస్తూ అంది.

‘‘నేను చూశాను’’ ఆకాష్‌ అన్నాడు.

‘‘చూశారా!?’’ ఆశ్చర్యపోతూ అడిగింది కీర్తన.

‘‘ఊ! సముద్రమంత గంభీరమైన వాడు ఆకాష్‌.’’

‘‘మీరా!?’’ నవ్వుతూ అంది.

‘‘నేను కాదు ఆకాశం’’ చెప్పాడు.

‘‘మరి సముద్రమంత లోతయినది?’’ ఆసక్తిగా అంది

‘‘మీరే!’’ టక్కున అన్నాడు. ఆమె విస్మయంగా చూసింది.

‘‘మీరే...అంటే స్త్రీ’’ విడమర్చి చెప్పాడు.

‘‘అమ్మో! మీకు చాలా తెలుసు’’ కళ్ళింతలు చేసి అంది.  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu aame oka rahasyam