మేష రాశి : ఈవారం మొత్తంమీద విందులు,వినోదాల్లో పాల్గొనాలనే ఆకాంక్ష ఉంటుంది ఆదిశగా అడుగులు వేస్తారు. ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని ఇవ్వడం చేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు భోజనసౌఖ్యంను కలిగిఉంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు అవసరం. అనారోగ్యం వలన ఇబ్బందులు తప్పవు కొంత విశ్రాంతిని కోరుకుంటారు. పోటీపరిక్షలకు సమయాన్ని ఇస్తారు దానితో పాటు సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకుంటే విజయం పొందుతారు. ఉద్యోగులకు బాగుంటుంది అధికారులతో గల సత్సంభందాలు మేలుచేస్తాయి. నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది.
వృషభ రాశి : ఈవారం మొత్తంమీద ప్రణాళికతో వ్యవహరించుట మూలాన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. బండుమిత్రులతో సమాలోచనలు చేయుటకు ఆస్కారం కలదు. కొంతమేర ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. సోదరవర్గం నుండి వచ్చే వార్తలు మీకు కొంత ఇబ్బందిని కలుగజేసేవిగా ఉంటవి.స్నేహితులతో సరదాగా గడుపుటకు ప్రయత్నం చేస్తారు కాకపోతే చదువు విషయంలో కూడా ఉన్నతమైన నిర్ణయం దిశగా అడుగులు వేయండి మంచిది. బాగానే ఉంటుంది కాకపోతే ప్రయాణాల మూలాన శ్రమను పొందుతారు. వ్యాపారస్థులకు ఆర్థికపరమైన విషయాల్లో లాభం ఉంటుంది.
మిథున రాశి : ఈవారం మొత్తంమీద నూతన ప్రయత్నాలు చేయక గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట వలన మేలుజరుగుతుంది. వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు తప్పక పోవచ్చును నిదానంగా వ్యవహరించుట వారికి దూరంగా ఉండుట మంచిది. వారం చివరలో మే ఆలోచనల్లో మార్పులు కలుగుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు. సరదగా గడుపుటకు ఇష్టపడుతారు. విద్యార్థులకు ఓపిక అవసరం పెద్దల సలహాలను పాటించుట వలన కొంత మేలుజరుగుతుంది. ఉద్యోగులకు బాగానే ఉంటుంది కాకపోతే అధికారులతో సత్సంభందాలు ఉన్నచో మేలుజరుగుతుంది .
కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబసభ్యులతో కలిసి చేయుప్రయత్నాలు పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవచ్చును. అనుకున్న దానికన్నా అధికమైన ఖర్చులు చేపట్టిన పనుల మూలాన అవుతాయి. అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తలు తీసుకోండి అశ్రద్ద వద్దు. చదువుపైన శ్రద్దతగ్గిపోతుంది ఈ విషయంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం అలాగే పెద్దల మాటను పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకుఅధికారులతో మాటను పడవలసి వస్తుంది కావున ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రతిపనిలో నిదానం అవసరం.
సింహ రాశి : ఈవారం మొత్తంమీద పనులకు సంభందించిన విషయాల్లో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరివరకు కొనసాగించే విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం బాగుంటుంది రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఇష్టమైన వారిని కలుస్తారు వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట మంచిది. రాజకీయపరమైన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. శ్రమపొందుట చేత ఉన్నతమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. పోటిపరిక్షల్లో రాణిస్తారు ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. సర్దుబాటు విధానం అవసరం.
కన్యా రాశి : ఈవారం మొత్తంమీద మిశ్రమ ఫలితాలు పొందుతారు వారం చివరలో నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. దానం విషయంలో ప్రయోగాలు చేయకపోవడం మంచిది. అధికారులతో కలిసి పనిచేస్తారు నూతన ఆలోచనలు కలిగి ఉంటారు,అలాగే చర్చాసంభందమైన విషయాల్లో మాత్రం నలుగురి ఆలోచనలు వినే ప్రయుత్నం చేయుట మంచిది. జీవితభాగస్వామి విషయంలో కొంత జాగ్రత్త అవసరం లేకపోతే వారివిషయంలో ఆందోళన తప్పకపోవచ్చును. పోటీపరిక్షల విషయంలో పెద్దల సూచనలు ఉపయోగపడుతాయి. ఉద్యోగులకు కొంత ఇబ్బందికాలంగానే చెప్పుకోవచ్చును,అకారణంగా విభేదాలు తప్పవు.
తులా రాశి : ఈవారం మొత్తంమీద నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన తప్పక మేలుజరుగుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. పెద్దలను కలిసే ఆస్కారం కలదు వారితో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం మూలాన మేలుజరుగుతుంది. కుటుంబపెద్దతో చర్చలు చేయునపుడు నిదానం అవసరం లేకపోతే మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం కలదు. బాగానేఉంటుంది ఆలోచనలు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. స్థిరమైన ఆలోచనలు చేసినచో మేలుజరుగుతుంది. తోటివారిని కలుపుకొని వెళ్ళండి కొన్నివిషయాల్లో సర్దుబాటు అవసరం.
వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులకు సంభందించి అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటూనే ముందుకు వెళ్ళుటకు ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన దృష్టిని సారించుట మంచిది. నలుగురికి ఉపయోగపడే పనులను చేపట్టుట ద్వార మంచి పేరును తెచ్చుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి నచ్చిన వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. పెద్దల అభిప్రాయాలు గౌరవించుట వలన మేలుజరుగుతుంది. నూతన అవకశాలను సద్వినియోగం చేసుకొనే వలన తప్పక మేలుజరుగుతుంది. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు ఉండే అవకాశం ఉంది. పనులపైన శ్రద్ధను చూపుత ఉత్తమం.
ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు,అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం సూచన. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదావేయండి. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు బాగుంటుంది ముఖ్యంగా దీర్ఘకాలికప్రయోజనాలు చూసుకొని ప్రయత్నం చేయుట మంచిది. పనిభారం పెరిగనను ఇబ్బందులు ఉండవు. కుటుంబసబ్యులతో సరదాగా గడిపే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు మాటవిషయంలో నిదానం అవసరం.
మకర రాశి : ఈవారం మొత్తంమీద పనులను నిదానంగా చేపట్టుట ఉత్తమం. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కనభరుస్తారు భోజనసౌఖ్యం ఉంటుంది. ఆలోచనలు పెరుగుటకు అవకాశం ఉంది దానిమూలాన మానసికంగా శ్రమను పొందుతారు. ప్రయాణాలు పెద్దగా ఉపయోగపడకపోవచ్చును. విద్యార్థులకు సమయంవృధా అయ్యే అవకాశాలు కనభడుతున్నవి కావున పెద్దలు వీరిని కనిపెట్టుకొని ఉండుట మంచిది. సమయపాలన అవసరం. ఉద్యోగులకు అధికారుల మూలాన కొంత శ్రమపెరుగుతుంది ఇబ్బందులు తప్పవు. వ్యాపారస్థులకు కొంత నిదానం అవసరం సమయానుకూలంగా నడుచుకోండి.
కుంభ రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబంలో మాత్రం పెద్దల లేదా అనుభవజ్ఞుల సూచనలు పాటించుటకు ప్రయత్నం చేయుట మంచిది. నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. చేపట్టు పనులకు సంభందించిన విషయాల్లో ప్రణాలిక అవసరం. సమయం విషయంలో సరైన ఆలోచనలు చేయుట ఉత్తమం. మాటలు పొదుపుగా వాడుట వలన విభేదాలు తగ్గుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు సమయాన్ని సరదాగా గడపాలనే తలంపు ఉటుంది. నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొంత చికాకు తప్పదు అనవసరపు పనులను చేపట్టవలసి రావోచ్సును. వ్యాపారస్థులకు పెద్దల ఆశీర్వాదం వలన మేలుజరుగుతుంది.
మీన రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తారు నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. శ్రమను కలిగి ఉంటారు ఆరోగ్యపరమైన సమస్యలు తప్పకపోవచ్చును. కుటుంబపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట మూలాన మేలుజరుగుతుంది. విద్యార్థులకు కష్టకాలమే కావున ఉన్నతమైన ప్రణాలిక అవసరం సమయపాలన వలన తప్పక మేలుజరుగుతుంది. మిశ్రమఫలితాలు కలుగుతాయి,తొందరపాటు వద్దు చిన్న చిన్న పనులను పూర్తిచేసే ప్రయత్నం మొదలు పెట్టుట వలన మేలుజరుగుతుంది. పెద్దలతో గుర్తింపును పొందుతారు అదేవిధంగా వారిసూచనలు పాటించుట చేయండి .
|