కావలిసినపదార్ధాలు: ములక్కాడలు, కోడిగుడ్లు (ఉడకబెట్టినవి), కారం, ఉప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు , కొత్తిమీర,టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు.
తయారుచేసేవిధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కరివేపాకు , ములక్కాడ ముక్కలను కూడా వేసి బాగా వేగనివ్వాలి. తరువాత టమాటలు, ఉప్పు, కారం వేసి కొడిగుడ్లను కూడా వేసి మూతపెట్టి 10 నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత అరగ్లాసు నీళ్ళు పోసి పులుపు కావలనుకున్నవాళ్ళు కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు లేదా నిమ్మకాయ రసాన్ని కూడా వాడవచ్చు. కొంచెం ఉడికాక చివరగా కొత్తిమీరను వేయాలి. అంతేనండీ..కోడీగుడ్డు ములక్కాడ కూర రెడీ..
|