Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Egg Drumstick curry

ఈ సంచికలో >> శీర్షికలు >>

భళిభళిభళి భళిరా భళి.....సాహోరే మన రాజమౌళీ.... - ..

Bahubali Song sung by Indonesians

ఉబ్జెకిస్తాన్ గాయకుల బృందం తన్మయంతో ఆలపిస్తున్నది మన పాట.....ఐదేళ్ళపాటు వేలాదిమంది కళాకారులతో కలిసి మన రాజమౌళి సృష్టించిన వెండితెర అద్భుతం తెలుగు సినిమా గర్వపడేలా ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగించిన భళిభళి భళిరా భళి......సాహోరే బాహుబలి....సాధారణంగా మన పాటలను మన గాయకులు విదేశాల్లో వేదికల మీద పాడడం చూస్తుంటాం. కానీ, మన భాషతో ఏమాత్రం సంబంధం లేని, ఎక్కడో ఉబ్జెకిస్తాన్ దేశంలోని హవాస్ గురు అనే ప్రముఖ గాయకుల బృందం ఈ పాటను ఇంత బాగా పాడగలిగారంటే, వారిని ఈ పాట, ఈ చిత్రం ఎంతగా ప్రేరణనిచ్చిందో చెప్పనక్కర్లేదు....

ఎంత ప్రాక్టీస్ చేసారో తలుచుకుంటేనే ఆశ్చర్యం కలుగక మానదు కదూ....అందులో ముఖ్యంగా ఆకర్షించేది ముద్దొచ్చేలా ఉన్న అమ్మాయి..." అంత మహా బలుడైనా....అమ్మ ఒడీ పసివాడే....." అంటూ ఆ అమ్మాయి పాడుతుంటే అచ్చు మన తెలుగులో విన్నట్టే అనిపిస్తుంది....ఎక్కడో కొన్ని పదాల ఉచ్చారణ తప్ప, మిగతా వాయిద్యాల నుంచీ గొంతుల అనుకరణ వరకూ అన్నీ మన కీరవాణి అడుగులో అడుగేసినట్టే ఉంది.....అదీ మన తెలుగోడి గొప్ప....భళిభళిభళి భళిరా భళి.....సాహోరే మన రాజమౌళీ....

 

- గోతెలుగు

మరిన్ని శీర్షికలు
ivanka_ love