Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

'అర్జున్‌ రెడ్డి' వాట్‌ ఏ విక్టరీ

arjunreddy what a victory

వివాదాలు సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడ్తాయి అనే విషయం 'అర్జున్‌ రెడ్డి' విషయంలో బాగా ప్రూవ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలకి ముందు, విడుదలయ్యాక కూడా వివాదాలు ఆగడం లేదు. అదే సినిమాపై ఆడియన్స్‌కి క్యూరియాసిటీ పెరిగేలా చేసింది. బాక్సాఫీస్‌కి కాసుల వర్షం కురిపిస్తోంది. నటీ నటులకు సూపర్‌ సక్సెస్‌ని సొంతం చేస్తోంది. అలాగని వివాదాలే ఏ సినిమాని అయినా ఆడించేస్తాయనుకోవడం పొరపాటు. 'అర్జున్‌రెడ్డి' సినిమాకి అన్నీ అలా కలిసొచ్చేశాయి. సినిమా బాగా తీశాడంటూ దర్శకుడికి ప్రశంసలు దక్కాయి. హీరో విజయ్‌ దేవరకొండకి అందుతున్న ప్రశంసలకు ఆకాశమే హద్దు. 'అర్జున్‌రెడ్డి' టీమ్‌ పడ్డ కష్టానికి తగిన గుర్తింపు లభించింది.

కమర్షియల్‌గా ఈ సినిమా సాధించిన విజయం అమోఘం. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమా ఏడు కోట్ల వసూళ్ళను సాధించింది. ఇదొక సరికొత్త రికార్డ్‌. తెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో 'అర్జున్‌రెడ్డి' కూడా ఒకటిగా చోటు దక్కించుకుంది. సినిమాలో విషయం ఉండాలే కానీ సక్సెస్‌ ఆటోమెటిగ్గా వచ్చేస్తుంది. అయితే పబ్లిసిటీ దానికి మరికొంత బూస్టప్‌నిస్తుంది. 'అర్జున్‌రెడ్డి' విషయంలో ఈ వివాదాల పబ్లిసిటీ బాగా పనికొచ్చిందనే చెప్పాలి. అంతే కాదు హీరోలోనూ విషయం దాగుంది. డైరెక్టర్‌ దాన్ని చాకచక్యంగా బయటికి తీసుకొచ్చాడు అంతే. విజయ్‌ దేవరకొండ, షాలిని జంటగా తెరకెక్కింది ఈ చిత్రం. సక్సెస్‌ఫుల్‌గా ధియేటర్స్‌లో రన్‌ అవుతోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
balayya dream project