'రాజుగారి గది - 2' మోషన్ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నాగార్జున బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌లో నాగ్ అదరగొట్టేస్తున్నాడు. చేతిలో రుద్రాక్ష మాలతో నాటి 'శివ' సినిమాని తలంపుకు తెస్తున్నాడు. అదో మాస్ మూవీ. ఇది హారర్ మూవీ. దానికీ దీనికీ పోలికేంటి అనుకుంటున్నారా? చేతిలో రుద్రాక్షని పట్టుకున్న తీరు, అప్పటి 'శివ' సినిమాలో ఓ యాక్షన్ సీన్ కోసం సైకిల్ ఛైన్ పట్టుకున్న సీన్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అవుతోంది. అందుకూ ఆ సినిమాని తలచుకోకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు.
తొలిసారిగా హారర్ బేసెడ్ మూవీలో నటిస్తున్నాడు నాగార్జున. మనుషుల మనస్తత్వాలను అధ్యయనం చేసే సైకియాట్రిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు నాగార్జున ఈ సినిమాలో. ఓంకార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వచ్చిన 'రాజుగారి గది' సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోందిది. కొత్త నటీనటులతో తెరకెక్కిన మొదటి సీక్వెల్‌కి మంచి సక్సెస్ దక్కింది. దానికి ఇప్పుడు నాగార్జున స్టార్ ఫ్లేవర్ యాడ్ అయ్యింది. అంతేకాదు, ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తోంది. సమంత పాత్ర చిన్నదే అయినా కానీ, చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర. నాగార్జున, సమంతల స్టార్ వేల్యూతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ముద్దుగుమ్మ సీరత్ కపూర్ నాగార్జునకి జంటగా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|