రవితేజ కొడుకొస్తున్నాడు. మాస్ మహారాజ్యానికి యువరాజు వస్తున్నాడు. 'రాజా ది గ్రేట్' సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు మాస్ మహరాజ్ రవితేజ తనయుడు మహాధన్. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో మహాధన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో నటిస్తుండగా, మహాధన్ కూడా అంధుడిగానే కనిపించనున్నాడు. అంటే తొలి సినిమాతోనే మహాధన్ ఛాలెంజింగ్ పాత్ర ఎంచుకున్నాడన్నమాట. అంధుడిగా నటించడం అంటే ఆషా మాషీ కాదు. అందుకోసం తండ్రి రవితేజతో పాటు, కొడుకు మహాధన్ కూడా చాలా కష్టపడ్డాడన్న మాట. రవితేజ అంటే ఎనర్జీకి మారు పేరు. సెట్స్‌లో మహాధన్ ఆ ఎనర్జీని మ్యాచ్ చేస్తున్నాడని ఇన్‌సైడ్ సోర్సెస్ అందిస్తున్న సమాచారాన్ని బట్టి తెలియవస్తోంది.
రూపంలో రవితేజని పోలి ఉన్నాడు. చాలా క్యూట్‌గా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక ఎనర్జీ లెవల్స్, యాక్టింగ్ టాలెంట్‌తో తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సినీ పరిశ్రమలో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదిగాడు రవితేజ. మహాధన్‌కి మాస్ మహరాజ్ రవితేజ అనే బ్యాక్‌గ్రౌండ్ ఉందిప్పుడు. అయినా ఛాలెంజింగ్ పాత్ర ఎంచుకున్నాడంటే అప్పుడే కమిట్‌మెంట్‌తో మహాధన్ ఉన్నాడనుకోవాలి. అందుకే మహాధన్‌కి హార్ట్‌ఫుల్‌గా గ్రాండ్ వెల్‌కమ్ చెబుతోంది టాలీవుడ్. ఆల్ ది బెస్ట్ టు మహాధన్.
|