Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - - డా . ఎస్ . జయదేవ్ బాబు

రాజ గాయకుడు : ఈ అతిథి గాయకుడి పెదవుల కదలికకీ, అతడు పాడిన పాటకీ పొత్తు లేదే..?
సేవకుడు : ఆ గాయకుడికి గొంతు పుండు! తనవెంట ఒక నేపథ్య గాయకుడిని తెచ్చుకుని పాడింవాడు !ఆ పాటకి ఈ గయకుడు పెదాలు కదిపాడు!!

-----------------------------------

 


కిన్నెరుడు : ఎవరాయన? మేఘాల మీద పచార్లు చేస్తున్నాడు?
కింపురుషుడు : కాళిదాస మహాకవి ! ' మేఘ సందేశం ' కావ్యం రాయడానికి కథ అల్లుతున్నాడు !!

 

--------------------------------------------------

 

 రామభట్టు " విష్ణుభట్టు గారి కొడుకూ, కోడలు ఒకరికి మించి ఒకరు సకల విద్యా పారంగతులటగా?
సోమభట్టు : ఔను ! ఇద్దరూ రాత్రిళ్ళూ, పగళ్ళూ చర్చల్లో మునిగి తేలుతుంటారు !
రామభట్టు : ఇద్దరికీ ఎంతమంది సంతానం?
సోమభట్టు : సంతానం లేదు, ఇద్దరూ చర్చల్లో మునిగి వుంటారన్నానుగదా!

                                --------------------------------------------------

 

 మంత్రి : కాలికి అంత చిన్న ముల్లు గుచ్చుకుంది ! ఆ మాత్రానికే బాధతో తట్టుకోలేకపోతున్నారు ! రేపు రణరంగంలో శత్రువుల వాడి బాణాలను ఎలా ఎదుర్కోగలరు రాజా ?
రాజు : నేను యుద్ధాలకు వెళ్ళను గదా ? బాణాల ప్రసక్తే లేదు.....బాధ సమస్యే లేదు ! మాట్లాడక.....ఆ ముల్లు తీయ్...!

                                 --------------------------------------------------

 ఉప్పునీటి కొడుకు చాప : నాన్నా ! ఆనకట్ట నుంచి మంచి నీరు సముద్రంలోకి విడుదల చేశారు. ! నా చుట్టూ మంచినీటి చాపలే ! ఎవర్ని చేసుకోను?
ఉప్పునీటి తండ్రి చాప : బాబూ ! నువ్వు ఉప్పునీటి చాపనే చేసుకోవాలి ! కావాలంటే మంచినీటి చాపలని ఉంచుకో, నాకభ్యంతరం లేదు !!

                                    --------------------------------------------------

 మహామంత్రి : మహా రాజా ! మీ పరిపాలనకి నిరసనగా, రాజ్యం యావత్తూ మీ దిష్టి బొమ్మలని తగలబెడ్తున్నారు ప్రభో !
మహారాజు : నా పరిపాలనా వ్యవహారాలని నిర్వహించేది నువ్వే కదా.....కనుక నీ దిష్టిబొమ్మలని కూడా తగలబెట్టమని వెంటనే ఉత్తర్వు జారీ చెయ్....!!

                                       --------------------------------------------------

మునిశేఖరుడు : నేనిన్ని వేల సంవత్సరాల ఖఠోర తపస్సు చేశానే ! నా తపోభంగం గావించడానికి , రంభ, రావాల్సింది పోయి, రంభ చెలి కత్తె వస్తవా?
చెలికత్తె : ఆవిడ ఇంట్లోకి రాకూడదు మునిశేఖరా......అందుచేత నన్ను పంపించింది....

 

                                 --------------------------------------------------

 

మనచేతిలో చిత్తుగా ఓడిపోయిన, ఆ పొరుగు దేశపు రాజుకి, యుద్ధ ముహూర్తం నిర్ణయించిన ఆ పురోహితుడ్ని వెంటనే మన కొలువుకి రప్పించు !
మంత్రిగారు : ఎందుకు ప్రభూ? ఆ రాజుని చెరసాలలో తోసినట్లు ఆ పురోహితుడ్ని కూడా శిక్షించదలిచారా ?
రాజుగారు : ఆ పురోహితుడిని ధనకనక వస్తు వాహనాలిచ్చి సత్కరించదలిచాను !

                                   --------------------------------------------------

 

యువరాణి : ఆనందంలో తలమునకలై ఉన్నారు ! నా అందం మిమ్మల్ని అంతగా పరవశింపచేసిందా నాథా ?
యువరాజు : నువ్వు సరిగా వినలేదు ! ఈ ప్రకృతి అందచందాలు నన్ను పరవశింపజేశాయి ఆన్నాను !!

 

--------------------------------------------------

 

భటుడు : మంత్రివర్యా ! మురజనులు తమకి పందులు కావాలని విన్నపం పంపించారు ..
మంత్రివర్యుడు : పందులతో ఏం అవసరం ?
భటుడు : మరుగుదొడ్లు శుభ్రం చెయ్యలేకపోతున్నారట!!

మరిన్ని శీర్షికలు