యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్‌గా మారనున్నాడు. హీరోగా పలు చిత్రాల్లో నటించిన రాహుల్, సుశాంత్ హీరోగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాకి 'చి.ల.సౌ' అనే డిఫరెంట్ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. అక్కినేని మేనల్లుడు సుశాంత్ గత కొంత కాలంగా గ్యాప్ తీసుకున్నాడు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా రాహుల్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. కథ చాలా ఇంప్రెసివ్‌గా ఉందంటున్నాడు సుశాంత్. క్యూట్ లవ్ స్టోరీ. కమర్షియల్ వేల్యూస్ అన్నీ సమపాళ్లలో మిళితమైన స్టోరీ ఇది. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఓ మంచి లవ్‌స్టోరీతో వస్తున్నాడు సుశాంత్ ఈ సినిమా ద్వారా. బుధవారం హైద్రాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది ఈ చిత్రం. చాలా కొత్తగా కనిపిస్తాడట సుశాంత్. స్టైలిష్‌గా సుశాంత్ క్యారెక్టర్‌ని డిజైన్ చేయనున్నాడట డైరెక్టర్ రాహుల్. ఎంతైనా హీరో కదా. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సినిమా కోసం యూజ్ చేయనున్నారనీ సమాచారమ్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సిరుని సినీ కార్పొరేషన్ బ్యానర్‌పై భరత్ కుమార్ మలశల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు. 'కాళిదాసు', 'కరెంట్' తదితర లవ్‌స్టోరీస్‌తో తనదైన శైలిలో హీరోగా ముద్ర వేసుకున్న సుశాంత్ ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి మరి.
|