Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aratikaaya Pulusu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాకూలు - సాయిరాం ఆకుండి

ధర (మ) క్షేత్రం

ధరల అదుపునకు లేదు అతీ గతీ...
అక్రమాల కట్టడికి లేదు పురోగతీ!

మందహాసానికి నోచుకోని మధ్యతరగతి...
అన్ని రంగాల్లో అడుగంటింది పరపతి!!


అవి..నీ..తి.. రోగ..మనం

అత్యాచారాలు ఆర్థిక నేరాలూ...
అభివృద్ధికి ఆనవాళ్ళు ఇవేనా?

కుటిల వాదాలు కులగజ్జి పోరాటాలు...
ప్రజాస్వామ్యానికి గీటురాళ్ళు ఇవేగా!!


ఏ'మందు'ను?

కాలం చెల్లిన మందులు కూడా...
ఎదేచ్ఛగా అమ్ముకోవచ్చిలా!

అసలూ నకిలీ.. తెలియదు తేడా...
నిశ్చింతగా నమ్మడమెలా?

మరిన్ని శీర్షికలు