Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
humorous

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (20 సెప్టెంబర్ - 26 సెప్టెంబర్) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకపోవడం ఉత్తమం. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఆది, సోమవారాల్లో నూతన పనుల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు, తలపెట్టిన పనులలో అభివృద్దిని పొందుటకు ఆస్కారం కలదు. భోజనం విషయంలో సంతృప్తిని పొందుతారు. మంగళ, బుధ, గురువారాల్లో అనారోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన. ఆశించిన ఫలితాలు రాకపోవడం మూలాన కొంత ఇబ్బందిని పొందుటకు అవకాశం కలదు. వారంలో మొత్తం మీద ప్రయత్నాలలో విజయంను పొందుటకు అవకాశం కలదు. నూతన వస్త్రప్రాప్తిని కలిగి ఉంటారు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకపోవడం ఉత్తమం. వారితోచేయు పనులలో నిదానంగా వ్యవహరించుట మేలు. వినోదములలో పాల్గొనుటకు ఆస్కారం కలదు. చర్చా సంబంధమైన విషయాల్లో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగంలో మాములుగా ఉంటుంది సర్దుకుపోవడం మంచిది. కోపంను అకారణంగా కలిగి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.     

వృషభ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో సంతోషంగా గడుపుతారు. నచ్చిన విషయాల కోసం సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను కలిగి ఉంటారు. పనులు పూర్తవుటకు అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో అధికమైన ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంది. ఆలోచనలు తగ్గించుకోవడం మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపలకు పోకపోవడం మేలుచేస్తుంది. శరీరశ్రమను కలిగి ఉంటారు. మంగళ, బుధ, గురువారాల్లో ఆలోచనలతో పనులను చేపట్టుట మూలాన లాభంను పొందుతారు. ధనం విషయంలో అనుకూలమైన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. ఆలోచనల వలన తోటివారితో గౌరవించబడుతారు. వారం మొత్తం మీద బంధుమిత్రులతో కొంత నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. చంచల మనస్సును కలిగి ఉండుట చేత నిర్ణయాల్లో తడబాటు ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వాటిమూలాన కొంత మేర ఇబ్బంది తప్పక పోవచ్చును. ఇష్టమైన పనులను చేపడుతారు. వాటిని సమయానికి పూర్తి చేయగలుగుతారు. చిన్న చిన్న కలహములు కలుగుటకు ఆస్కారం ఉంది. నిదానంగా వ్యవహరించుట మంచిది. ధర్మసంబంధమైన విషయాల్లో పాల్గొంటారు. వాటికి సమయాన్ని కేటాయించుట మంచిది. కుటుంబ సభ్యుల మూలాన శ్రమను పొందుటకు అవకాశం ఉంది. నిదానంగా వ్యవహరించుట మంచిది. 

మిథున రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో బంధువులయెడల ప్రీతిని కలిగి ఉంటారు. ఇష్టమైన పనులను చేపట్టి సకాలంలో పూర్తిచేయుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో సంతోషంగా గడుపుతారు. ఆశించిన ఫలితాలు కలుగుటకు అవకాశం కలదు. బంధువుల గృహంలో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. ధాన్యవృద్దిని కలిగి ఉంటారు. మంగళ, బుధ, గురువారాల్లో అనుకోని ఖర్చులు పెరుగుటకు ఆస్కారం కలదు. తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. బంధువులతో స్వల్ప విభేదాలు వచ్చుటకు అవకాశం ఉంది. సర్దుబాటు విధానం కలిగిఉండుట తప్పక మేలుచేస్తుంది. వారంమొత్తం మీద ప్రయాణాలలో ఆటంకాలు పొందుటకు అవకాశం కలదు. చేపట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుతాయి. కుటుంబంలో స్వల్పవిభేదాలు కలుగుటకు ఆస్కారం కలదు. నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. నూతన పనులను ఆరంభించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట ఉత్తమం. అకారణంగా భయంను కలిగి ఉంటారు. ఆర్థికపరంగా బాగానే ఉంటుంది. అభివృద్దిని పొందుటకు అవకాశం కలదు. పెద్దలతో కలిసి పనిచేయుట మూలాన మేలు జరుగుతుంది. అధికారులతో మాత్రం వారికీ అనుగుణంగా నడుచుకోండి మంచిది. చపలచిత్తము కలిగి ఉండే అవకాశం ఉంది. సేవకుల మూలాన సౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. ఇష్టమైన పనుల కోసం సమయాన్ని కేటాయిస్తారు.
 

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. కావున నిదానంగా వ్యవహరించుట మంచిది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట ఉత్తమం. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు. ఆది, సోమవారాల్లో బంధవుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులలో విజయంను పొందుటకు ఆస్కారం ఉంది. మంగళ, బుధ, గురువారాల్లో మానసిక సౌఖ్యంను కలిగి ఉంటారు. భోజనసౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన లాభంను పొందుతారు. నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం కలదు. వారం మొత్తంమీద బంధువులతో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. సంతాన మూలక సౌఖ్యంను పొందుతారు. చేపట్టిన పనులలో విజయంను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు వచ్చుటకు అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించుట మంచిది. గాయములు అయ్యే అవకాశం కలదు. బంధువులతో మాటపట్టింపులకు పోకపోవడం ఉత్తమం. అధికారుల మూలాన పని ఒత్తిడిని కలిగి ఉంటారు. చంచల మనస్సును కలిగి ఉంటారు. స్థిరంగా ఆలోచన చేయుట మంచిది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులను పొందుటకు అవకాశం ఉంది. కుటుంబంలో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. మంచి ఆలోచనలు చేయుట మూలాన లాభంను పొందుతారు.  

సింహ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో చేపట్టిన పనులలో కష్టాలను పొందుటకు అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా భోజనం విషయంలో తప్పక జాగ్రత్తలు పాటించుట మేలు. ఆది, సోమవారాలలో అన్యప్రదేశంలో నివసించవలసి రావోచ్చును. ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. కుటుంబంలో నూతన నిర్ణయాలను తీసుకోవాలనే ఆలోచనను వాయిదా వేయుట ఉత్తమం. మంగళ, బుధ, గురువారాల్లో తలపెట్టిన పనులను సకాలంలో పూర్తిచేయుటకు అవకాశం కలదు. బంధువులతో కలిసి చేపట్టిన పనులలో విజయంను పొందుతారు. ఇష్టమైన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. వారం మొత్తంమీద అనారోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారంలో స్వల్ప ధననష్టం పొందుటకు అవకాశం కలదు. స్నేహితులతో నిదానంగా వ్యవహరించుట మంచిది. శరీరాయసంను మాత్రం పొందుటకు అవకాశం కలదు. సంచారం చేయవలసి రావొచ్చును. మంచివారితో మీకున్న పరిచయాల మూలాన తప్పక లాభంను పొందుటకు ఆస్కారం కలదు. క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. శత్రువులను జయించుటకు అవకాశం కలదు. ధనంకు సంబంధించిన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట మేలు.
 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ఆర్థికంగా లాభాలను కలిగి ఉంటారు. చేపట్టిన పనుల మూలాన గౌరవాభివ్రుద్దిని పొందుతారు. మంచిపనులను చేపట్టే విధంగా ఆలోచనలు కలిగి ఉండుట ఉత్తమం. మానసికంగా సంతోషంను పొందుతారు. ఆది, సోమవారాల్లో స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. భోజనం విషయాల్లో అశ్రద్ద వద్దు. పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుతాయి. మంగళ, బుధ, గురువారాల్లో ఉద్యోగంలో నూతన ఆలోచనలు చేయకండి. అధికారులకు అనుగుణంగా నడుచుకోండి మంచిది. అకారణంగా కలహములు కలుగుటకు ఆస్కారం ఉంది. నిదానంగా వ్యవహరించుట మూలాన గొడవలు సద్దుమణిగే అవకాశం కలదు. వారం మొత్తంమీద సమయానికి భోజనం చేసేవిధంగా ప్రణాళికను సిద్దం చేసుకోండి. బంధువులతో మిత్రులతో స్వల్ప మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. అకారణంగా లేనిపోని భయాలను కలిగిఉండే అవకాశం ఉంది. ధనలాభంను కలిగించే పనులను చేపట్టే అవకాశం ఉంది. ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. మనస్సుచంచలంగా ఉండే అవకాశం ఉంది కావున నూతన ఆలోచనలు వద్దు. కుటుంబంలో బాగానే ఉంటుంది. వారితో సమయాన్ని సంతోషంగా గడిపే అవకాశాలు కలవు. ఆదిశగా ఆలోచనలు చేయండి.

తులా రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ఇతరులకు సేవచేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. ఆర్థికపరమైన లాభంను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో మీ ఆలోచనలు ఇతరులకు సహాయపడేవిగా ఉంటాయి. చేపట్టిన పనులలో ఆర్ధికపరమైన లాభంను పొందుతారు. స్త్రీ/పురుష సౌఖ్యంను పొందుతారు, మిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. మంగళ, బుధ, గురువారాల్లో అనారోగ్య సమస్యలు కలుగుతాయి తగిన జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. తలపెట్టిన పనుల రిత్యా కష్టములు కలుగుటకు అవకాశం ఉంది. వారం మొత్తం మీద ప్రయాణాలు చేయుట మూలాన ఇబ్బందులు పొందుతారు. ప్రయాణాలలో అలసిపోవుటకు ఆస్కారం ఉన్నది. స్థానచలనంకు అవకాశం కలదు. అనుకోనిఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి. ఆహారం విషయంలో జాగ్రత్త పాటించుట మంచిది. లేకపోతే అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. చేయువ్రుత్తిలో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. నిదానంగా పనిచేయుట మంచిది. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పెద్దల సూచనలతో పనిచేయుట మూలాన ఆర్థికలాభంను పొందుతారు.

వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో చేపట్టిన పనులు నిదానంగా ముందుకు సాగుతాయి. చిన్న చిన్న ఆటంకాలు కలుగటకు ఆస్కారం ఉంది. నూతన ప్రయత్నాలను వాయిదావేయుట మంచిది. ఆది, సోమవారాల్లో కుటుంబంలో కలుగు మార్పులు సంతోషాన్ని కలుగజేస్తాయి. అనుకూలమైన వాతావరణం ఏర్పడుటకు ఆస్కారం కలదు. చేపట్టిన పనులకు సంబంధించిన విషయాల్లో ఆర్థికపరమైన లాభంను కలిగి ఉంటారు. నూతన పనులను చేపడుతారు. మంగళ, బుధ, గురువారాల్లో ధనాదాయం బాగుంటుంది. చేపట్టిన పనుల మూలాన గౌరవాన్ని కలిగి ఉంటారు. సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో గుర్తింపు కోసం చేయుప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను కల్గజేయుటకు అవకాశం ఉంది. మొత్తంమీద వారంలో ఆర్థికపరమైన లాభంను కలిగి ఉంటారు. శుభకార్యములలో పాల్గొనుటకు అవకాశం కలదు. భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు. స్థానచలనంకు అవకాశం ఉంది. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. బంధువులను కలిసే అవకాశం కలదు వారితో కాంత సమయాన్ని గడుపుతారు. విలువైన వస్తువులను మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి వాటిని కోల్పోయే అవకాశం ఉంది జాగ్రత్త.

ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ప్రయత్నాలలో నిదానంగా వ్యవహరించుట మంచిది. నూతన ప్రయత్నాలు ఆరంభించే ముందు పెద్దల సూచనలు పాటించుట ఉత్తమం. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం సూచన. ఆది, సోమవారాల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. మంగళ, బుధ, గురువారాల్లో కుటుంబంలో నూతన నిర్ణయాలను చేపట్టి ముందుకు సాగుతారు. ఆర్థికపరమైన విషయల్లో లాభంను పొందుటకు అవకాశం ఉంది. సేవగుణాన్ని కలిగి ఉంటారు ఇతరులకు ఉపయోగపడే ఆలోచనలను చేయుటకు అవకాశం ఉంది. నూతన పనులను ఆరంభిస్తారు. వారం మొత్తంమీద బంధుమిత్రులను కలిసే అవకాశం ఉంది. వారితో సమయాన్ని సంతోషంగా గడుపుతారు. అధికారులతో కలిసి మీరుచేపట్టు పనులు లాభాలను కలుగజేస్తాయి. స్థానచలనం ఉండుటకు అవకాశం ఉంది. ప్రయాణాల మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును. రుణ భాదలు తప్పక పోవచ్చును. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. అభీష్టమైన పనులను పూర్తిచేస్తారు. భోజనం విషయంలో ప్రత్యేక ఇష్టంను కలిగి ఉంటారు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు.

మకర రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ఇష్టమైన వారిని కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఉల్లాసంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. కాకపోతే నిదానం అవసరం. ఆది, సోమ వారాల్లో అనుకోని ఇబ్బందులు ప్రయత్నాలలో కలుగుటకు ఆస్కారం కలదు. పనులలో కలిగిన ఆలస్యం మూలాన ఆందోళనను పొందుతారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం ఉంది. మంగళ, బుధ, గురువారాల్లో స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. అశుభవార్తను వినే అవకాశం కలదు. మానసికంగా దృడంగా ఉండుట సూచన. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు. వారం మొత్తంమీద అనుకోని ఖర్చులను కలిగి ఉంటారు. ధననష్టంను పొందుటకు అవకాశం ఉంది. అకారణంగా ఏర్పడు కలహముల మూలాన మనోవిచారంను కలిగి ఉంటారు. కుటుంబంలో నిదానంగా వ్యవహరించుట మంచిది సర్దుబాటు విధానం అవలంబించుట ఉత్తమం. పనులలో కలిగిన ఆలస్యం మూలాన నిరుత్సహంను పొందుతారు. ఇతరులు మీ ఆలోచనలు వ్యతిరేకించే అవకాశం కలదు. మీ ఆలోచనలు వారికినచ్చక పోవచ్చును. అధికారుల మూలాన పనిభారంను కలిగిఉంటారు. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. శత్రువుల మూలాన భయంను పొందుతారు. ధనం విషయంలో జాగ్రత్త.

కుంభ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ధననష్టంను పొందుతారు. నూతన ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అనారోగ్య సమస్యల మూలాన చిన్న చిన్న సమస్యలు తప్పక పోవచ్చును. ఆది, సోమవారాల్లో నూతన వస్త్రలాభంను పొందుటకు అవకాశం కలదు. ఇష్టమైన వారిని కలుస్తారు. వారితో కలిసి కొత్త కొత్త పనులను చేపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. మంగళ, బుధ, గురువారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. నిదానంగా వ్యవహరించుట మంచిది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుటకు అవకాశం కలదు. వారం మొత్తంమీద అనేకరూపములుగా కష్టములను పొందుటకు అవకాశం ఉంది. జాగ్రత్తగా ముందుకు వెళ్ళుట మంచిది. వ్యతిరేకవర్గం వృద్ది చెందుటకు అవకాశం కలదు జాగ్రత్త. ఒకవార్త కొంత భాదను కలిగించుటకు అవకాశం కలదు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి పనులను చేపట్టుట మూలాన కీర్తిని పొందుతారు. సమయానికి భోజనం చేయుట మంచిది. మాటలను మాత్రం పొదుపుగా వాడుట ఉత్తమం. విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం కలదు జాగ్రత్త. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. పెద్దలతో సలహాలను తీసుకొని పాటించే ప్రయత్నం చేయుట ఉత్తమం. 

మీన రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. ధనం విషయంలో అభివృద్దిని పొందుటకు అవకాశం కలదు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. తోటివారితో సన్మానంను పొందుటకు అవకాశం కలదు. ఆది, సోమవారాల్లో కొంత నిరాశను పొందుటకు అవకాశం కలదు జాగ్రత్త. అనుకోని ఖర్చులను పొందుటకు అవకాశం కలదు. ఒకవార్త కొంత నిరాశను కలిగించే అవకాశం కలదు. మంగళ, బుధ, గురువారాల్లో ఇష్టమైన వారిని కలిసే అవకాశం ఉంది. నచ్చిన వారితో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు. మనోదైర్యంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. వారం మొత్తం మీద బంధుమిత్రులతో స్వల్ప విరోధాలు కలుగుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులలో ఉత్సాహంను కోల్పోతారు. ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట మంచిది. పనిభారం ఉంటుంది. పాప సంబంధమైన పనులలో పాల్గొంటారు. అధికారులతో నిదానంగా వ్యవహరించుట మేలు. కొంత ఖర్చును కలిగి ఉంటారు. అనారోగ్యం విషయంలో ఇబ్బందులను పొందుతారు. స్థానచలనంకు అవకాశం ఉంది ప్రయాణాలు చేస్తారు. కలహములకు దూరంగా ఉండుట ఉత్తమం. అధికారులను కలుస్తారు. వారితో కలిసి పనిచేయుట మంచిది. అధికారుల మూలాన లాభం పొందుతారు. విందులలో పాల్గొంటారు.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Why we do Pradakshina